Urination Diseases : మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుందా…? అయితే, ఈ 4 వ్యాధుల లక్షణాలు కావచ్చు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Urination Diseases : మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుందా…? అయితే, ఈ 4 వ్యాధుల లక్షణాలు కావచ్చు…?

 Authored By ramu | The Telugu News | Updated on :9 March 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Urination Diseases : మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుందా...? అయితే, ఈ 4 వ్యాధుల లక్షణాలు కావచ్చు...?

Urination Diseases : కొంతమందికి మూత్ర విసర్జన సమయంలో మంట ఎక్కువగా ఉంటుంది. అలాగే నొప్పి కూడా కలుగుతుంది. దీన్ని అంత తేలిగ్గా కొట్టి పారేశారో ప్రమాదకరం కావచ్చు.. కొన్నిసార్లు ప్రజలు దీన్ని ఒక చిన్న సమస్యగా చూస్తారు. అస్సలు పట్టించుకోరు. కావున ఇది త్రీవ్రమైన వ్యాధులుకు సంకేతంగా కూడా భావిస్తారు. మూత్ర విసర్జన చేసే సమయంలో మంటగా అనిపిస్తే అది డిహైడ్రేషన్ లేదా ఇన్ఫెక్షన్ల వల్ల మాత్రమే కాదు.. మూత్రపిండాల సమస్యలు, మూత్రణాల ఇన్ఫెక్షన్ (UTI), షుగర్ వంటి వ్యాధుల ప్రారంభ లక్షణాలు కూడా అవ్వచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట కలిగితే దాన్ని అంత తేలిగ్గా తీసి పడేయకండి.

Urination Diseases మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుందా అయితే ఈ 4 వ్యాధుల లక్షణాలు కావచ్చు

Urination Diseases : మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుందా…? అయితే, ఈ 4 వ్యాధుల లక్షణాలు కావచ్చు…?

కొంతమంది ఈ సమస్యను అంతా సీరియస్గా తీసుకోరు. ఇది కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా కూడా కావచ్చు. మూత్ర విసర్జన చేసే సమయంలో డిహైడ్రేషన్ లేదా ఇన్ఫెక్షన్ల వల్ల మాత్రమే కాదు, మూత్రపిండాల సమస్యలు, మూత్ర నాళ్లాల ఇన్ఫెక్షన్ కావచ్చు. కొన్నిసార్లు డయాబెటిస్ వ్యాధి లక్షణాలు కూడా కావచ్చు. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ గురించి ప్రత్యేక శ్రద్ధలు పాటించాలి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మూత్ర విసర్జన సమయంలో మంట కలిగితే, నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. చెప్పిన సూచనలను పాటించాలి. అయితే, మూత్ర విసర్జన సమయంలో మంట ఉంటే, ఈ నాలుగు తీవ్రమైన వ్యాధుల సంకేతాలుగా గుర్తించవచ్చు. మరి ఆ వ్యాధులు ఏమిటి…? దీని గురించి వైద్యులు ఏమంటున్నారు… ఈ విషయాలను తెలుసుకుందాం…

Urination Diseases యూరినరీ ట్రాక్టు ఇన్ఫెక్షన్( UTI)

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఒక సాధారణ సమస్య.. ఇది ఎక్కువగా మహిళల లోనే వస్తుంది. బ్యాక్టీరియా మూత్రాన నాళాల లోకి ప్రవేశించినప్పుడు ఇది జరుగుతుంది. దీని లక్షణాలు మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట. నొప్పి, తరచూ మూత్ర విసర్జన, దుర్వాసన లేదా మూత్రంలో మబ్బుగా ఉండడం లేదా పొత్తికడుపులో నొప్పి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక, ముద్ర పరీక్షలు చేయించుకోండి. ఈ ఇన్ఫెక్షన్ ను యాంటీబయోటిక్స్ తో చికిత్స చేయవచ్చు.

కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా రాళ్లు : మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటతో పాటు నడుము కింది భాగంలో నొప్పి అనిపిస్తే. ఇది కిడ్నీలో ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలలో రాళ్లు ఏర్పడినది అని సంకేతం. దీని లక్షణాలు మూత్రంలో రక్తం, జ్వరం, చలి, వికారం, వాంతులు లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి.. అయితే. మూత్రపిండాల సమస్యలను నివారించడానికి, ఎక్కువ నీరు తాగాలి. ఈ సమస్యను సమయానికి గుర్తించి మూత్రపిండాల అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవాలి.

లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STD) : లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STD) నువ్వు మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటను కూడా కలిగిస్తాయి. దీని లక్షణాలు జననేంద్రియాల లో దురద లేదా మంట. అసాధారణ స్రావం లేదా మూత్ర విసర్జన సమయంలో నొప్పి. ఇన్ఫెక్షన్ ను నివారించడానికి సురక్షితమైన లైంగిక చర్య లను పాటించాలి. ఏంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

డయాబెటిస్ : డయాబెటిస్ రక్తంలో చక్కెర పెరుగుదల మూత్ర నాలంలో బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం అవుతుంది. ఇది మూత్ర విసర్జన సమయంలో మంటను కలిగిస్తుంది. దీని లక్షణాలు అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, అలసట లేదా బలహీనత, ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోవాలి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది