Hair Tips : జుట్టు పల్చబడదు, ఊడదు.. దట్టంగా పెరుగుతుంది…. ఊడిన చోట ఈ ఆయిల్ అప్లై చేస్తే…
Hair Tips : చాలామంది ఈ జుట్టు రాలే సమస్యతో ఎంతో బాధపడుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఈ జుట్టు రాలే సమస్య రోజురోజుకి ఎక్కువ అవుతుంది. ఈ సమస్యలకు ఎన్నో రకాల రెమెడీస్ ను ట్రై చేసి చేసి విసిగిపోయి ఉంటారు. అలాంటివారికి ఇప్పుడు తాజాగా ఆయుర్వేద నిపుణులు ఒక ఆయిల్ ని మన ముందుకి తీసుకొచ్చారు. ఈ ఆయిల్ ఎటువంటి కెమికల్స్ ను వాడరు. ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం..
దీని తయారీ విధానం: బృంగరాజ్ ఆకులు వీటిని తెలుగులో గుంటగలరా ఆకు అని అంటారు. ఈ ఆకులు జుట్టుని నల్లగా మార్చడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనిలో ఆరు రకాల ఉపయోగాలు ఉన్నాయి. మొదటిగా దీనిలో సైటో కెమికల్స్ , యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉండడం వల్ల జుట్టు స్పీడ్ గా పెరుగుతుంది. 2వది జుట్టు నల్లగా మారడానికి జుట్టు పొదలలో ఉండేటువంటి మెలోనో సైట్స్ డామేజ్ అవ్వకుండా నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. అలాంటి వాటిని రిపేర్ చేయడంలో సిమెలేట్ చేయడం లో ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. 3వది దీనిలో కోలాజిన్ ప్రొడక్షన్ మాడు మీద జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది.
4వది ఈ బృంగరాజ్ ఆకులలో విటమిన్ ఈ ఉంటుంది అది జుట్టు కుదులను స్ట్రాంగ్ గా చేసి జుట్టు ఊడకుండా రక్షిస్తుంది.5వది జుట్టుని తక్కువ టైంలోనే తిరిగి వచ్చేలా ఉపయోగపడుతుంది. 6వది. మాడు భాగంలో ఉండేటువంటి దాని నుంచి మంచి రక్షణ కలిగిస్తుంది. ఇలా ఆరు రకాల ఉపయోగాలను ఇచ్చే ఈ గుంట గులరాకు ఏ విధంగా వాడుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.. ఈ బృంగరాజ్ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని జ్యూస్ లాగా తయారు చేయాలి. దానిలో నువ్వుల నూనె కలిపి బాగా మరిగించి చల్లారిన తర్వాత వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచాలి. దీనిని ప్రతిరోజు జుట్టు పై కుదుల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇలా ఈ ఆయిల్ ను వాడినట్లయితే మీ జుట్టు సమస్యలు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది.