Vitamin D : విటమిన్ డి తో గుండె జబ్బులు ప్రమాదం తక్కువ… ఇంకా ఎన్నో ప్రయోజనాలు…
Vitamin D : మనిషి దృఢంగా ఉండడానికి విటమిన్ డి ఎంతో అవసరం. దీనిని సూర్యరశ్మి నుంచి పొందవచ్చు. ఉదయం పూట ఎండలో కొన్ని నిమిషాల నిలబడితే శరీరానికి కావలసిన విటమిన్ దొరుకుతుంది. అయితే ఎన్నో ఆహార పదార్థాలు ద్వారా కూడా దీన్ని పొందవచ్చు. విటమిన్ డి ద్వారా ఎన్నో రోగాల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు..
విటమిన్ డి ఉపయోగాలు
శరీర రోగనిరోధక వ్యవస్థ బలోపితం చేయడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి శరీరాన్ని కావలసిన కాలుష్యాన్ని గ్రహించి ఎముకలను దృఢంగా ఉంచుతుంది. డిప్రెషన్ లాంటి మానసిక సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
విటమిన్ డి మోతాదు
ప్రతిరోజు పిల్లలు యువతకు 600 Iu లేదా 15 మైక్రోగ్రాముల విటమిన్ డి చాలా ముఖ్యం. పెద్దవారు గర్భిణీలు పారిచేతలను 600 IU లేదా 15 గ్రాములు విటమిన్ డి చాలా ముఖ్యం.
సప్లిమెంట్స్ తో ఉపయోగాలు
విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు బలహీనంగా అవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవడానికి ఆహార పదార్ధాలతో పాటు విటమిన్ డి సప్లిమెంటరీ కూడా తీసుకోవచ్చు. మార్కెట్లో ఎన్నో విటమిన్ డి టాబ్లెట్ లు క్యాప్సిల్స్ దొరుకుతాయి.
విటమిన్ డి లభించే ఆహారాలు
చేపలు విటమిన్ డి అధిక మొత్తంలో ఉంటుంది. దీంతో వీటిని ఎక్కువగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చ సొన లో కూడా ఇది ఉంటుంది. పుట్టగొడుగులు, పాలు, తృణధాన్యాలు, పెరుగు నారింజ లాంటి వాటిని కూడా విటమిన్ డి అధికంగా ఉంటుంది..
క్యాన్సర్ల నివారణలో కీలకం
విటమిన్ d3 కొన్ని రకాల క్యాన్సర్ల అభివృద్ధిని నిరోధించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. విటమిన్ డి సప్లిమెంట్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మ క్యాన్సర్ రిస్కు కూడా తగ్గుతుంది. అలాగే బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. విటమిన్ డి శరీరానికి కావలసిన అంతగా దొరికితే రుమాటాయి డ్ ఆర్తోరైటిస్తో ఇబ్బంది పడేవారుకి ఉపశమనం కలుగుతుంది.