Watermelon : పుచ్చకాయను వేసవికాలంలో తప్పకుండా తీసుకోవాలి… లేదంటే ఈ సమస్యలు తప్పవు…!
ప్రధానాంశాలు:
Watermelon : పుచ్చకాయను వేసవికాలంలో తప్పకుండా తీసుకోవాలి... లేదంటే ఈ సమస్యలు తప్పవు...!
Watermelon : ఇక వేసవికాలంలో అడుగుపెట్టాము.. చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది వేసవి తాపం నుంచి బయటపడవాలను కోసం కొన్ని రకాల డ్రింక్స్ ని తాగుతూ ఉంటారు. అలా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా వేసవి తాపాన్ని తీర్చే పుచ్చకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నీటి శాతం శరీరానికి మేలు చేస్తుంది. అలాగే విటమిన్లు ,పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మరి ప్రధానంగా సమ్మర్లో పుచ్చకాయను తీసుకోవడం వలన వేసవికాలంలో వచ్చే సమస్యలకు నుంచి ఉపశమనం కలిగించి వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. అయితే పుచ్చకాయ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం…
జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థలో వ్యర్ధాలను బయటికి పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. *అలాగే పుచ్చకాయలో ఉండే విటమిన్ సి, కెరిటో నాయుడు తో సహా పలు ఆంటీ ఆక్సిడెంట్లు ప్రీ ర్యాడికల్స్ తో పోరాడేందుకు ఉపయోగపడతాయి. దీంతో క్యాన్సర్ లాంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. *చర్మ సమస్యలకు వాటర్ మిలన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఏ వల్ల చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. *పుచ్చకాయ పోషకాల గని అని పిలుస్తారు. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి లాంటి పోషకాలు శరీరానికి ఎంతగానో సహాయపడతాయి. దీనిలో సిట్రో లైన్స్ శారీరిక చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది.
పుచ్చకాయ బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి కారణం పుచ్చకాయలు క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దానివల్ల బరువు పెరగడం కూడా కంట్రోల్ లో ఉంటుంది. సహజంగా వేసవి కాలంలో ఎదురు అయ్యే సమస్యలు డిహైడ్రేషన్ గురి చేస్తుంది.. ఈ వేసవిలో ఎంత నీరు తీసుకున్న ఈ సమస్య వస్తూ ఉంటుంది. ముఖ్యంగా బయట తిరిగేవారు డిహైడ్రేషన్ కి అధికంగా ఊరవుతూ ఉంటారు. కావున వేసవిలో కచ్చితంగా పుచ్చకాయ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..