Betel Plant : తమలపాకు మొక్కని ఇంట్లో పెంచితే లాభాలేంటి… ఏ దిక్కులో పెంచాలి…!!
ప్రధానాంశాలు:
Betel Plant : తమలపాకు మొక్కని ఇంట్లో పెంచితే లాభాలేంటి... ఏ దిక్కులో పెంచాలి...!!
Betel Plant : తమలపాకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఈ తమలపాకులు లేనిదే పూజలు మరియు వ్రతాలు పూర్తి కావు. అలాగే తమలపాకు లేకుంటే తాంబూలం కూడా ఇవ్వరు. ఈ తమలపాకులు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులను తినడం వలన దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. ప్రస్తుతం చాలామంది తమలపాకు మొక్కలను ఇంట్లో పెంచుకుంటున్నారు. అయితే వాస్తు ప్రకారం చూసినట్లయితే, కొన్ని మొక్కలను ఇంట్లో అసలు పెంచకూడదు. ఇలా పెంచుకోవడం వలన ఇంట్లో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం చూసినట్లయితే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచడం వలన ధన లాభం కూడా వస్తుంది.
అయితే ఈ తమలపాకుని ఇంట్లో పెంచుకోవటం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయి. దీనిని పెంచుకుంటే ఏ దిక్కులో పెంచాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.డబ్బుకు లోటు ఉండదు : తమలపాకు మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం చూస్తే ఈ మొక్కకు ఎంతో విశిష్టత కూడా ఉన్నది. అలాగే ఆయుర్వేదంలో కూడా ఈ తమలపాకు మొక్కలను పలు రకాల వ్యాధులను తగ్గించడంలో ఔషధంగా వాడతారు. అయితే ఈ తమలపాకు చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడు అసలు ఉండడు అనే నానుడు ఉంది. ఈ తమలపాకు మొక్క అనేది ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టాలు ఉండవు అని ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అని అంటారు.
మీకు సరిగ్గా కలిసి వస్తే పట్టిందల్లా బంగారు అని కూడా అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది : ఈ తమలపాకు మొక్క ఇంట్లో ఉండడం వలన సాక్షాత్తు లక్ష్మీదేవి మరియు ఆంజనేయస్వామి ఇంట్లో కొలువై ఉన్నట్టే. ఈ మొక్క అనేది వేపుగా చక్కగా పెరిగినట్లయితే అప్పుల బాధలు కూడా ఉండవు అని అంటారు. ఇది మాత్రమే కాకుండా బుధ గ్రహం అనుగ్రహం కూడా కలుగుతుంది అని అంటారు.
తూర్పు వైపు ఉంచాలి : ఈ మొక్క అనేది బాగా పెరగాలి అంటే సూర్యరశ్మి బాగా తగిలే చోటు పెట్టాలి. అలా అని మరీ ఎండలో పెట్టిన కూడా మొక్క అనేది మాడిపోతుంది. ఈ మొక్కను బాగా ఎండ తగిలేచోట ఉంచరాదు. అలాగే ఈ మొక్కను తూర్పు వైపు ఉంచితే చాలా మంచిది అంట. కావున తమలపాకు మొక్కని ఎటువంటి డౌట్స్ లేకుండా ఇంట్లో పెంచుకోవచ్చు…