Ear Wax : చెవిలో నిత్యం ఏదో ఒకటి పెట్టి తిప్పడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసా…!!
Ear Wax : మన చెవిలో గుబిలి ఉండడం అనేది సర్వసాధారణమైనా విషయం. దీంతో చెవులలో వేలు మరియు అగ్గిపుల్లలు, పిన్నిసులు లాంటివి పెట్టి తిప్పుతూ ఉంటారు. అయితే మనలో ఎంతోమంది చేసే పని మాత్రం ఇదే. అలాగే మనం చెవిలో ఉన్నటువంటి గుబిలిని తీయటం కోసం ఇలా చేస్తూ ఉంటారు. వీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా చెవిలో పిన్నిసులు పెట్టి తిప్పుతూ ఉంటారు. అయితే ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది […]
ప్రధానాంశాలు:
Ear Wax : చెవిలో నిత్యం ఏదో ఒకటి పెట్టి తిప్పడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసా...!!
Ear Wax : మన చెవిలో గుబిలి ఉండడం అనేది సర్వసాధారణమైనా విషయం. దీంతో చెవులలో వేలు మరియు అగ్గిపుల్లలు, పిన్నిసులు లాంటివి పెట్టి తిప్పుతూ ఉంటారు. అయితే మనలో ఎంతోమంది చేసే పని మాత్రం ఇదే. అలాగే మనం చెవిలో ఉన్నటువంటి గుబిలిని తీయటం కోసం ఇలా చేస్తూ ఉంటారు. వీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా చెవిలో పిన్నిసులు పెట్టి తిప్పుతూ ఉంటారు. అయితే ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. ఇటువంటివి వాడడం వలన గుబిలి రావడం అనేది పక్కన పెడితే అవి మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు…
అవి చెవి మధ్యలో ఇరుక్కునిపోయి మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే కొన్ని సందర్భాలలో కర్ణభేరికి చిల్లుపడే అవకాశం కూడా ఉంది అని నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వలన చెవి నొప్పితో పాటుగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మీకు దీర్ఘకాలంగా ఇదే సమస్య గనక వెంటాడుతుంటే విడికిడి తగ్గే అవకాశం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. అయితే మనలో చాలామంది చెవిలో గుబిలి తీస్తే చెవి శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది అని భావిస్తారు…
నిజానికి ఇది వాస్తవం కానే కాదు. వినికిడి అనేది బాగుంటే ఇలాంటివి చేయకపోవడమే మంచిది అని అంటున్నారు. నిజం చెప్పాలంటే చెవిలో ఉండే గొబిలి చెవి ఆరోగ్యాన్ని రక్షించడంలో హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు. అలాగే చెవులోకి దుమ్ము మరియు ధూలీతో పాటుగా హానికరమైన వస్తువులను చెవిలోకి వెళ్ళకుండా గుబిలి అనేది అడ్డుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. ఒకవేళ మీరు గనక చెవి శుభ్రం చేసుకోవాలి అని అనుకుంటే వైద్యుల సంరక్షణలో మాత్రమే చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే మన చెవిలో ఉండే చర్మం అనేది చాలా పల్చగా ఉంటుంది. కావున పిన్నిసులు లాంటివి పెట్టడం వలన చెవులో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. నిపుణులు