White Jamun : తెల్ల నేరేడు పండుని మీరు చూశారా…. దీన్ని తింటే బోలెడన్ని లాభాలు ఉన్నాయి తెలుసా…?
ప్రధానాంశాలు:
White Jamun : తెల్ల నేరేడు పండుని మీరు చూశారా.... దీన్ని తింటే బోలెడన్ని లాభాలు ఉన్నాయి తెలుసా...?
White Jamun : సాధారణగా నల్ల నేరేడు పండ్లు గురించి మనందరికీ తెలుసు. తెల్ల నేరేడు పండ్లు కూడా ఉన్నాయని విషయం కొందరికి తెలియదు. ఈ తెల్ల నేరేడు పండు కొంచెం తియ్యగా, మొత్తం తింటే నాలుక రంగు మారిపోతుంది. అయితే నల్ల నేరేడు తో పాటు తెల్ల నేరేడు పండ్లు కూడా ఉంటాయనేది ఎవరికి కూడా తెలియదు.. వీటి వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆకారంలో వాటికి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆరోగ్య పోషకాలు అందించడంలో మాత్రం వాటికి మించినవి. ఈ తెల్ల నేరేడు పండ్లు చాలా అరుదుగా దొరుకుతాయి. తెల్ల నేరేడు పండ్లు మార్కెట్లలో ఎక్కువగా కనిపించవు. ఈ ఆకారంలో కూడా కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆరోగ్య పోషకాలు అందించడంలో మాత్రం వాటికి మించినవి మరేవీ లేవు. అంతర్వేదంలో కూడా తెల్ల నేరేడు పండు ప్రస్తావన ఉంది. తినమని ఆయుర్వేదం కూడా సూచిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల ఆలోచన ఉన్న కొందరు రైతులు మాత్రమే వీటిని పండిస్తున్నారు. ప్రస్తుతం కాయ కాపు దశకు వచ్చి చెట్లపై కాయలతో కళకళలాడుతూ ఉన్నాయి. ప్రాంతాలలో నేరేడు పండ్లను అల్లా నేరేడు అని కూడా పిలుస్తారు. వేదంలో నల్ల నేరేడు పండ్ల కంటే కూడా తెల్ల నేరేడు పండ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మొక్క 100 నుంచి 150 రూపాయల వరకు దొరుకుతుంది.

White Jamun : తెల్ల నేరేడు పండుని మీరు చూశారా…. దీన్ని తింటే బోలెడన్ని లాభాలు ఉన్నాయి తెలుసా…?
White Jamun తెల్ల నేరేడు పండ్ల సాగు
ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న పుష్పాల వెంకట్రావుకు తూర్పుగోదావరి జిల్లా రావూరి పాడులో వ్యవసాయ భూమి ఉంది. అందులో వేసిన తెల్ల నేరేడు చెట్టుకు ఈ ఏడాది విపరీతంగా కాపుకో వచ్చింది. తొలికాపు కాపు వేయడంతో ఆయన పండ్లను కోసి హైదరాబాదులోని తన స్నేహితులకు రుచి చూపించేందుకు పట్టుకెళుతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఉంటే వాటి పట్ల ఆసక్తి ఉంటుంది అందులోను ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి, అంటే ఖరీదైన వినియోగం తప్పనిసరిగా మారుతుంది. ఇప్పటికే సాధారణ నేరేడు హైబ్రిడ్ కాయలు వచ్చేసాయి. కమర్షియల్ క్రాప్ గాను కొందరు పెంచుతుంటారు. భవిష్యత్తులో ఈ స్థానంలోకి తెల్ల నేరేడు వచ్చి చేరే అవకాశం కూడా కనిపిస్తుందని ఆయన చెప్పారు.
నేరేడు పండు ఉపయోగాలు : తెల్ల నేరేడు పండులో చాలా పోషక విలువను దాగి ఉన్నాయి. వేదంలో కూడా వీటిని వాడుతారనే నిపుణులు పేర్కొంటున్నారు.ఇవి ఎక్కువగా వేసవిలో లభిస్తాయి. ఈ సీజన్లో తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. మన శరీరానికి ఎండ దెబ్బ నుంచి కాపాడుటకు అంటే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. వేడి సంబంధం అనారోగ్యాలను కూడా దూరం చేస్తుందట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు కూడా ఎక్కువే. కాబట్టి, వీటిని తింటే వేసవిలో బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే చాలా రోగాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.