Men or Women : అధిక ఒత్తిడికి గురయ్యేది ఎవరు…? పురుషులా, మహిళలా….!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Men or Women : అధిక ఒత్తిడికి గురయ్యేది ఎవరు…? పురుషులా, మహిళలా….!!

 Authored By ramu | The Telugu News | Updated on :24 July 2024,8:00 am

Men or Women : మన భారతదేశంలో అధికంగా ఒత్తిడికి గురయ్యే వారి గురించి యువర్ దోస్ట్ అనే సంస్థ అధ్యాయనం చేసింది. ఈ అధ్యయనంలో వెలువడిన నిజాలు షాక్ కు గురి చేస్తున్నాయి. సాధారణంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అందుకే పురుషులే ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు అని మనం అనుకుంటాం. కానీ ఇది చాలా వరకు తప్పు. పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతారు అని యువర్ దోస్ట్ సంస్థ తెలిపింది. మన దేశవ్యాప్తంగా ఉద్యోగం చేస్తున్న 5000 మందిపై ఈ సర్వే ను నిర్వహించడం జరిగింది. అయితే పురుషులతో పోల్చినట్లయితే ఆఫీసులలో పనిచేసే మహిళలు అధిక ఒత్తిడికి గురవుతున్నారు అని సర్వే చేసిన ప్రతినిధులు తెలిపారు. ఈ సర్వే చేసినటువంటి వారిలో 72.2% మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని తేలింది. కానీ మగవారిలో 53 శాతం మంచి ఉన్నట్లు తేలింది…

మహిళల్లో ఒత్తిడికి కారణాలు తెలుపుతూన్నారు. వాళ్లకు సరైన గుర్తింపు అనేది లేకపోవడం మరియు తోటి ఉద్యోగులతో ఎక్కువగా కలవలేకపోవడం, ప్రతి విషయానికి భయపడటం, అనుమానంగా ఉండటం లాంటి విషయాలు బయటపడ్డాయి. అలాగే వాళ్ల ఇంట్లో పనులు, బాధ్యతలు, పిల్లల కారణంగా కూడా స్ట్రెస్ కి గురవుతున్నారు. అయితే పురుషులతో పోలిస్తే వారి కంటే 30 శాతం ఎక్కువ మంది మహిళలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా సర్వేలో తేలింది. వీటితో మహిళల్లో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయి అని తెలిపారు. అలాగే డయాబెటిస్ బీపీ, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్,ఊబకాయం, సరైన టైమ్ ఉండకపోవటం, గుండె సమస్యలు ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి అని తెలిపారు…

Men or Women అధిక ఒత్తిడికి గురయ్యేది ఎవరు పురుషులా మహిళలా

Men or Women : అధిక ఒత్తిడికి గురయ్యేది ఎవరు…? పురుషులా, మహిళలా….!!

అయితే ఉద్యోగుల ఎమోషనల్ వెల్ నేస్ స్టేట్ నివేదిక ప్రకారం చూసినట్లయితే 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 64.42 శాతం మహిళ ఉద్యోగులు ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. అలాగే 31-40 ఏళ్ల మధ్య వయసు ఉన్న కార్మికులు 59.81 శాతం, 41-50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో 53 శాతం టెన్షన్ కి గురవుతున్నట్లుగా నివేదికలో తేలింది. అంతేకాక వర్క్ ప్లేస్ లో మార్పులు కూడా మహిళ ఆరోగ్యం మరియు మానసిక ఒత్తిడి పై ప్రభావం పడుతుంది. ఇలా చూస్తే పురుషులకంటే ఆడవారే ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నట్టుగా నివేదికలో తేలింది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది