Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మరి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!
ప్రధానాంశాలు:
Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మరి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం సేవించే విధానాలు మాత్రం ఒక్కో రకానికి వేరు వేరు. ఉదాహరణకు మీరు చాలాసార్లు విస్కీకి ఐస్ కలిపి తాగే వారిని చూసి ఉంటారు. కానీ అదే పని వైన్‌తో చేస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చాలామంది వైన్‌లో ఐస్ కలపరు.

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మరి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!
Whisky Wine : ఇది అసలు కారణం..
వేసవికాలంలో గ్రీష్మ తాపాన్ని తట్టుకునేందుకు చాలామంది విస్కీకి ఐస్ జోడించి తాగుతారు. ఇది సరికొత్త తాపనను ఇచ్చి తాగడం సులభంగా మారుతుంది. ఐస్ కలిపితే విస్కీ శక్తి కొద్దిగా తగ్గుతుంది. దీని వల్ల అది తేలికగా తాగదగినదిగా మారుతుంది. ఐస్ కరిగే కొద్దీ విస్కీ రుచి నెమ్మదిగా మారుతూ కొత్త వాసనలు, రుచులను వెలికితీయగలదు. ఇది ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది.
వైన్‌కు ఐస్ ఎందుకు జోడించరు అంటే వైన్‌లో ఐస్ కలిపితే, నీటి శాతం పెరుగుతుంది. దాంతో తీపి, ఆమ్లత, సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. వైన్ అసలు రుచి నశిస్తుంది. ఐస్ వల్ల వాసనల సమతుల్యత చెడుతుంది. ఫ్రూటీ, ఫ్లోరల్ నోట్స్ అన్నీ మాయమై పోతాయి. కొన్నిసార్లు నీరసమైన వాసన కూడా రావచ్చు. ఐస్ కలిపే బదులు చాలామంది వైన్‌ను ముందే ఫ్రిడ్జ్‌లో చల్లబరుస్తారు. ఇది రుచి చెడకుండా చల్లగా తాగడానికి ఉత్తమ మార్గం. మీరు ఏ మద్యం తీసుకున్నా జాగ్రత్తగా, పరిమితంగా ఉండాలి. ఆరోగ్యం ముఖ్యం.