Women : పురుషుల కంటే స్త్రీలలోనే మైగ్రేన్ ఎందుకు వస్తుంది .. ? ఈ అలవాట్లే కారణమా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women : పురుషుల కంటే స్త్రీలలోనే మైగ్రేన్ ఎందుకు వస్తుంది .. ? ఈ అలవాట్లే కారణమా..!

 Authored By tech | The Telugu News | Updated on :8 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Women : పురుషుల కంటే స్త్రీలలోనే మైగ్రేన్ ఎందుకు వస్తుంది .. ? ఈ అలవాట్లే కారణమా..!

Women : మైగ్రేన్ అనేది చాలా సాధారణ సమస్య. అయితే ఈ సమస్య అనేది పురుషులకంటే ఎక్కువగా మహిళల్లోనే వస్తుంది. మైగ్రేన్ నొప్పి కనీసం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది. దీంతోపాటు వికారం లేదా వాంతులు కూడా ఉంటాయి. ఒక రకమైన ధ్వని విన్న అసౌకర్యంగా అనిపించడం, చికాకుగా అనిపిస్తుంటుంది. మైగ్రేన్ నొప్పి మూడు రోజుల వరకు నిరంతరంగా ఉంటుంది. నొప్పి మొదటగా ఒకవైపు నుంచి మొదలై తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. చాలామంది మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నారు. ఇది చెవిలో రింగింగ్ ధ్వనిలాగా అనిపిస్తుంది. కానీ ఇది ఒక సాధారణ సమస్య. మన దేశంలోని మొత్తం జనాభాలో దాదాపు పదిహేను శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. మహిళల్లో ఈ సమస్యకు ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత అని అంటున్నారు. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా హార్మోన్లు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.

ఈ సమస్యకు ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రధాన కారణం. ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా మైగ్రేన్ సమస్య తలెత్తుతుంది. చాలామంది స్త్రీలు పీరియడ్స్ సమస్యల కోసం రెగ్యులర్ హార్మోన్ల మందులు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గర్భనిరోధక మాత్రలు కూడా తీసుకునేవారు చాలామంది ఉన్నారు. వీరిలోనే మైగ్రేన్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మైగ్రేన్ సమస్య ఎక్కువగా 18 , 49 సంవత్సరాల వయస్సు గల వారిలో ఎక్కువగా వస్తుందట. కోవిడ్ అనంతరం కాలంలో ఈ సమస్య మరింతగా పెరిగిందని అంటున్నారు. మైగ్రేన్ డిప్రెషన్, మానసిక అస్థిరత వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మైగ్రేన్ సమస్యను వదిలించుకోవడానికి డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది. మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఎండలోకి వెళ్ళినప్పుడు తలనొప్పి వస్తే, ఆకలిగా ఉన్నప్పుడు తలనొప్పి వస్తుంటుంది. అధిక ఒత్తిడి, సరిగ్గా నిద్ర పోకపోయినా తలనొప్పి వస్తుంది. ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే మైగ్రేన్ తో బాధపడేవారు చాక్లెట్లు, కాఫీ అస్సలు తీసుకోకూడదు. ప్రస్తుతం చాలామంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అధిక ఒత్తిడికి గురైన ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా మైగ్రేన్ సమస్య అనేది వస్తుంది. మైగ్రేన్ నొప్పి విపరీతంగా ఉంటుంది కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మైగ్రేన్ ఉన్నవారు కాఫీ లు చాక్లెట్లు అస్సలు తీసుకోకూడదు అవి తీసుకున్నప్పుడు మైగ్రేన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది