Uric Acid : యూరిక్ యాసిడ్ రాత్రి సమయంలోనే ఎక్కువగా పెరుగుతుంది,ఎందుకు…. దీనికి సంకేతాలు ఇవే…?
ప్రధానాంశాలు:
Uric Acid : యూరిక్ యాసిడ్ రాత్రి సమయంలోనే ఎక్కువగా పెరుగుతుంది,ఎందుకు.... దీనికి సంకేతాలు ఇవే...?
Uric Acid : సాధారణంగా యూరిక్, యాసిడ్ రక్తంలో కరిగి బయటకు వస్తుంది. కానీ, దీని పరిమాణం పెరిగినప్పుడు అది స్పటికాలుగా ఏర్పడుతుంది. ఇది కీళ్లలో పేరుకుపోతుంది. అయితే, ముఖ్యంగా,రాత్రి సమయాలలో అటువంటి పరిస్థితుల్లో శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. యూరిక్ యాసిడ్ రాత్రి సమయాలలోనే ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం. ప్యూరిన్ అనే మూలకం విచిన్నమైనప్పుడు శరీరంలో యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సాధారణంగా రక్తంలో కరిగి బయటకు వస్తుంది.కానీ, దాని పరిమాణం పెరిగినప్పుడు అది స్పటికాలుగా ఏర్పడుతుంది.అలాగే కీళ్లలో పేరుకుపోతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇటువంటి పరిస్థితులలో శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. దీన్ని గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం..

Uric Acid : యూరిక్ యాసిడ్ రాత్రి సమయంలోనే ఎక్కువగా పెరుగుతుంది,ఎందుకు…. దీనికి సంకేతాలు ఇవే…?
Uric Acid కీళ్లలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి
యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు మొదట కీళ్లపై ప్రభావితం చూపుతుంది. రాత్రి సమయంలో ఒక కాలులో, అకస్మాత్తుగా భరించలేని నొప్పి దీనికి ప్రధాన సంకేతం కావచ్చు.
కీళ్లలో వాపు,వెచ్చదనం : రాత్రి పూట వేళ్లు, చీలమండలు లేదా మోకాళ్ళలో తేలికపాటి వాపు వెచ్చదనం అనిపిస్తే,అది యూరిక్ యాసిడ్ స్పటికాలు వేరుకపోవడానికి సంకేతం.
తేలికపాటి జ్వరం లేదా అసౌకర్యం : యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. దీనివల్ల తేలికపాటి జ్వరం, అసౌకర్యం లేదా రాత్రిపూట చెమటలు పట్టడం వంటివి జరుగుతాయి.
తక్కువ మూత్ర విసర్జన లేదా మంట : యూరిక్ యాసిడ్ శరీరం నుండి మూత్రం ద్వారా తొలగించబడుతుంది.కానీ అది పెరిగినప్పుడు మూత్రం తక్కువగా ఉండవచ్చు. లేదా మూత్ర విసర్జన మంట ఉండొచ్చు, లక్షణాలు రాత్రిపూట ఎక్కువగా అనిపించవచ్చు.
అలసట, భారంగా అనిపించడం : శ్రమ లేకుండానే శరీరం రాత్రి సమయంలో అలిసినట్లుగా అనిపించినా, శరీరం బరువు అనిపించినా, నిద్ర తర్వాత కూడా మీరు ఉత్సాహంగా లేకపోయినా, అధిక యూరిక్ యాసిడ్ సంకేతం కావచ్చు. జీవ క్రియ అసమతుల్యత లక్షణం కావచ్చు.
రాత్రి నొప్పి : రోజంతా కూడా కీళ్లలో నొప్పి ఉండదు. కానీ, నొప్పి రాత్రిపూట మాత్రమే సంభవిస్తే ఇది యూరిక్ యాసిడ్ సమస్య అని అర్థం చేసుకోవాలి.