Yoga Tips : యోగా చేసే టైంలో పాటించాల్సిన కొన్ని నియమాలు… అవేంటంటే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Yoga Tips : యోగా చేసే టైంలో పాటించాల్సిన కొన్ని నియమాలు… అవేంటంటే…!!

Yoga Tips : మనం రోజు యోగా చేయడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి అని నిపుణులు ఎప్పుడు అంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవాలి అంటే నిత్యం ఖచ్చితంగా యోగ చేయాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగ ప్రయోజనాలపై విస్తృత ప్రచారం బాగా పెరిగింది. అయితే ఎంతో మంది స్టార్స్ కూడా ఈ విషయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే కరోనా వచ్చి పోయిన తర్వాత ఆరోగ్య స్పృహ చాలా […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 September 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Yoga Tips : యోగా చేసే టైంలో పాటించాల్సిన కొన్ని నియమాలు... అవేంటంటే...!!

Yoga Tips : మనం రోజు యోగా చేయడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి అని నిపుణులు ఎప్పుడు అంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవాలి అంటే నిత్యం ఖచ్చితంగా యోగ చేయాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగ ప్రయోజనాలపై విస్తృత ప్రచారం బాగా పెరిగింది. అయితే ఎంతో మంది స్టార్స్ కూడా ఈ విషయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే కరోనా వచ్చి పోయిన తర్వాత ఆరోగ్య స్పృహ చాలా బాగా పెరిగింది. దీని వలన ఎంతో మంది తమను తాము ఫిట్ గా ఉంచుకోవడానికి యోగాను ఎంచుకుంటున్నారు. అయితే కొన్ని వారాలలోనే సెలబ్రిటీ బాడీ ని పొందాలి అంటే కొన్ని కొన్ని సార్లు చాలా కష్టమైన ఆసనాలు కూడా వేయాల్సి ఉంటుంది. కానీ వాటిపై ఎలాంటి అవగాహన లేకుండా చేస్తే లేనిపోని ప్రమాదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు తెలియకుండా మీరు ఏదైనా ఆసనాన్ని అకస్మాత్తుగా ట్రై చేస్తే గాయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీటిని మీరు జీవితాంతం మోయాల్సి ఉంటుంది. మీరు గనక యోగా ప్రయోజనాలు పొందాలి అంటే నిత్యం కచ్చితంగా సాధన చేయాల్సి ఉంటుంది. అయితే యోగ చేసేటప్పుడు కొన్ని నియమాలను కూడా అనుసరించాలి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

మీరు యోగా సాధన చేసే ముందు మీ శారీరక స్థితి మరియు ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలిగి ఉండాలి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు కనుక ఉంటే దాని ప్రకారమే యోగాసనాలను ఎంచుకోవాలి. అయితే ఈ యోగాలు ఎన్నో రకాలు ఉన్నాయి. అవి పవర్ యోగ, హఠ యోగ, బీక్రమ్ యోగ, ఆక్వా యోగ లాంటివి. అయితే మీరు ఏ రకమైన యోగాను సాధన చేయాలి అనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ ఆసనం గనుక కొంచెం కష్టంగా ఉంటే, శ్వాసను సాధారణంగా ఉచ్చటం మర్చిపోతుంటాం. కానీ ఆసనం అంటేనే శ్వాస తీసుకోవడం. అయితే ఆసనం మరియు శ్వాస ద్వారానే శరీరం అనేది నిర్వీకరణం చేయబడుతుంది. కావున ఆసనం వేసేటప్పుడు శ్వాసపై కూడా శ్రద్ధ పెట్టాలి…

Yoga Tips యోగా చేసే టైంలో పాటించాల్సిన కొన్ని నియమాలు అవేంటంటే

Yoga Tips : యోగా చేసే టైంలో పాటించాల్సిన కొన్ని నియమాలు… అవేంటంటే…!!

ఫస్ట్ టైం లోనే ఎదుటివారిని చూసి కష్టమైన ఆసనాలు వేయడానికి ఆసక్తి చూపకండి. మీరు యోగా లో విజయం సాధించాలి అంటే ఓర్పు మరియు ఏకాగ్రత మరియు శ్రద్ధ ఎంతో అవసరం. మీరు చేసే ఆసనం ఏదైనా కష్టంగా ఉంటే దానిని ఒక్కసారిగా చేయకుండా నిదానంగా ఆసనం వేయటానికి మీ శరీరాన్ని సిద్ధం చేయాలి. అయితే ఎంతోమంది కొన్ని రోజులపాటు బేసిక్ రోటిన్ ను పాటించిన తర్వాత వదులుకుంటారు. దీంతో ఒక్కోసారి ఇంట్లో ప్రాక్టీస్ కు కూడా అంతరాయం అనేది ఏర్పడుతుంది. ఏదైనా ఒక్కరోజులోనే జరిగిపోదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు యోగ ప్రయోజనాలు పొందాలి అంటే వారానికి కనీసం మూడు రోజులు కచ్చితంగా నిత్యం సాధన చేయడం చాలా ముఖ్యం..

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది