Macadamia : మకాడమీయా ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందే…!
ప్రధానాంశాలు:
Macadamia : మకాడమీయా ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందే...!
Macadamia : మార్కెట్లలో రోజుకు ఒక కొత్త డ్రై ఫ్రూట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటే మకడామియా. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు, మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. జింక్ మరియు రాగి అధిక మోతాదులో ఉండడం వలన ఇది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే మకాడమీయా లో మాంగనీస్, విటమిన్ బి 1 కూడా లభిస్తాయి. ఇవి మెదడు చూడు గా పనిచేయడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. బరువు తగ్గడంలో కూడా మకాడమియా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అలాగే ఎక్కువసేపు ఆకలి అనిపించదు…
మాకడమీయ ఎముకలు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో లభించే ఫైబర్ కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. అయితే మకడమీయ నట్స్ లలో మోనోశాచురెటేడ్ అనే మంచి కొవ్వులు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇది నేరుగా రక్తంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండె సమస్యలను నయం చేస్తాయి. ఆంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే మకడమీయా లో విటమిన్ ఇ , ఫ్లేవనాయిడ్లు కూడా అంతే మోతాదులో ఉన్నాయి. ఇవి నేరుగా గుండె ఆరోగ్యానికి మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన రోగాలను తగ్గించడంలో సహాయపడతాయి.
మకాడమీయా నట్స్ తినడం వలన బ్రెయిన్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ నట్స్ లో ఉండే ఆంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కీళ్ల నొప్పులు ,వాపు మరియు అర్థరైటిస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే సులభంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మకడామియా తినడం వల్ల మలబద్ధకం మరియు అజీర్తి వంటి సమస్య లు తగ్గుముఖం పడతాయి.