Heart Attack : ఈ విత్తనాల తో గుండె పోటు మటుమాయం… అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు…!
ప్రధానాంశాలు:
Heart Attack : ఈ విత్తనాల తో గుండె పోటు మటుమాయం... అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...!
Heart Attack : చాలామంది డ్రై ఫ్రూట్స్ అంటేనే జీడిపప్పు ,బాదం, ఎండుద్రాక్ష ,మరియు పిస్తా పప్పులు అని అనుకుంటారు. కానీ కాలం గడుస్తున్న కొద్ది అనేక రకాల కొత్త డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం మరో కొత్త రకం విత్తనాలు డ్రైఫ్రూట్స్ జాబితాలో చేరాయి. అదేమిటో కాదు జనపనార విత్తనాలు. ఈ పేరుని చాలాసార్లు వినే ఉంటారు. జనపనార గింజలలో ప్రోటీన్, ఫైబర్, ఓమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, భాస్వరం పొటాషియం , క్యాల్షియం, విటమిన్ బి6 ,బి12, డి మరియు e మెగ్నీషియం, సల్ఫర్ ఇనుము వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.
![Heart Attack ఈ విత్తనాల తో గుండె పోటు మటుమాయం అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Heart-Attack.jpg)
Heart Attack : ఈ విత్తనాల తో గుండె పోటు మటుమాయం… అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు…!
మరి కొంతమంది అయితే ఈ విత్తనాలను జ్యూస్ లపై మరియు సలాడ్లపై చల్లుకొని తింటారు. అయితే వీటిని నీళ్లలో నానబెట్టుకొని త్రాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జలపనార గింజలు తినడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయి. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఇకపోతే ప్రాణాంతకరమైన గుండె సమస్యలను నియంత్రణలో పెట్టడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శరీరంలో ఉండే చెడు కొలస్ట్రాలను నియంత్రరించి శరీరానికి కావలసిన రోగానిరోధక శక్తిని పెంచుతుంది.
రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నట్లయితే సీజన్ వ్యాధులు ఏవి కూడా దాడి చేయవు. తరచు ఈ విత్తనాలు తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జనపనార గింజలు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. వీటివల్ల త్వరగా ఉపశమనం చెందుతారు. ఈ విత్తనాలు వ్యాధులకే కాకుండా చర్మం జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు కలిగిస్తాయి. కాబట్టి వీలైనంతవరకు క్రమం తప్పకుండా ఈ విత్తనాలు తీసుకోవడం చాలా మంచిది.