Waking Up : నిద్ర లేచిన వెంటనే శరీరం బరువుగా అనిపిస్తుందా… అస్సలు నిర్లక్ష్యం చేయకండి…??
ప్రధానాంశాలు:
Waking Up : నిద్ర లేచిన వెంటనే శరీరం బరువుగా అనిపిస్తుందా... అస్సలు నిర్లక్ష్యం చేయకండి...??
Waking Up : ఉదయం నిద్రా లేవగానే మీకు శరీరం బరువుగా అనిపిస్తుందా. అయితే శరీర బరువులో ఈ మార్పు అనేది నీటి బరువు కారణం వలన ఈ సమస్య అనేది తలెత్తుతుంది అని నిపుణులు అంటున్నారు. ఈ విషయం మీకు ఎంతో ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇది మాత్రం నిజం. అయితే మన శరీర మొత్తం బరువులో 50 నుండి 60 శాతం నీరే ఉంటుంది. అయితే నీరు మరియు ఇతర ద్రవాలు అనేవి శరీరంలో పేరుకుపోవడం వలన శరీరం బరువు పెరుగుతుంది. అయితే ఇది పొత్తికడుపు మరియు చేతులు, కాళ్లు,పాదాలు వాపు కు కారణం అవుతాయి. అలాగే కొన్నిసార్లు మనకు ముఖం ఉబినట్లు కూడా అనిపిస్తుంది. అలాగే ఋతు స్రావం మరియు గర్భధారణ టైమ్ లో స్త్రీలు ఎక్కువగా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కావున నీటి బరువు సమస్య అనేది మీలో కూడా ఉంటే,దానిని మాత్రం తీవ్రంగా పరిగణించాలి. ఎందుకు అంటే దీనిని నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య అనేది మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే శరీరం నుండి నీటిని తీసివేసే బదులుగా ఎక్కువ ద్రవ శరీరంలో పేరుకుపోయినప్పుడు శరీరంలో నీటిని నిలుపుకోవడం లాంటిది జరుగుతుంది. దీనినే నీటి బరువు అని అంటారు. అలాగే వేసవి మరియు చలికాలంలో ఈ సమస్య అనేది సర్వ సాధారణం. ఎందుకు అంటే వేడి వాతావరణం లో కణజాలం నుంచి ద్రవాలను బయటికి పంపించడం అనేది చాలా కష్టం. అలాగే శరీరంలోని కొన్ని లక్షణాల వలన ఈ సమస్య అనేది వస్తుంది. ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది. ఈ సమస్య యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Waking Up ఉదయం నిద్ర లేవగానే కనిపించే లక్షణాలు
-కాలు మరియు పాదాలలో వాపు.
– బరువు పెరగడం లేక బరువులో హెచ్చుతగ్గులు.
– చర్మం వాపు.
– కీళ్ల నొప్పులు.
– శరీరంలో కొన్ని చోట్ల నొప్పి.
– రుతుస్రావ టైమ్ లో రొమ్ము బరువు పెరుగుట.
Waking Up ఈ సమస్య ఎందుకు వస్తుంది
-ఉప్పు మరియు కార్బోహైడ్రేట్లర్ ఎక్కువ తీసుకోవడం.
– ఎక్కువసేపు కూర్చోవడం మరియు నిలబడడం.
– ప్రోటీన్ లేక విటమిన్ బి వన్ పోషకాల లోపం.
– అలర్జీ మరియు ఇన్ఫెక్షన్, రక్త గడ్డ కట్టడం, బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండడం