Hyderabad..ఆలిండియా స్పీకర్స్, కౌన్సిల్ చైర్మన్స్ మీటింగ్.. హాజరైన పోచారం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad..ఆలిండియా స్పీకర్స్, కౌన్సిల్ చైర్మన్స్ మీటింగ్.. హాజరైన పోచారం

 Authored By praveen | The Telugu News | Updated on :15 September 2021,2:02 pm

మన దేశంలో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పదనై పలువురు రాజ్యాంగ పరిశీలకులు, నేతలు గతంలోనే పేర్కొన్నారు. ఇకపోతే దేశంలోని శాసన సభ, శాసన మండలి సభాపతి, చైర్మన్‌ల ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 1921 సెప్టెంబర్ 15న జరిగింది. ఇది జరిగి సరిగ్గా వందేళ్లు పూర్తి అయింది. కాగా బుధవారం మళ్లీ ఈ ఆలిండియా స్పీకర్స్, కౌన్సిల్ చైర్మన్స్ మీటింగ్ వర్చువల్ విధానంలో జరిగింది. ఈ సమావేశానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించారు. ఇకపోతే దేశంలోని రాష్ట్రాల శాసన సభల సభాపతులు, ఉప సభాపతులు, శాసమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్స్ పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల శాసన సభల సభాపతులు, ఉప సభాపతులు, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ హాజరయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్, శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి మీటింగ్‌కు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి వివరించినట్లు తెలుస్తోంది.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది