Kurnool.. అన్ని సేవలు సచివాలయంలోనే: ఎమ్మెల్యే
కర్నూల్ జిల్లాలోని కల్లూరు మండలంలోని ఉలిందకొండ గ్రామ సచివాలయ్యాన్ని పాన్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన అన్ని సేవలు సచివాలయంలోనే అందుతాయని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు ఏ సమస్యలున్నా సచివాలయంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలు, వారి అభివృద్ధి కోసమే పని చేస్తున్నదని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. గతంలో ప్రభుత్వాలు ప్రజలను ఓటు బ్యాంకుగా చూసిందని, ప్రస్తుతం అలా కాదని తాము ప్రజల అభివృద్ధిక కట్టుబడి ఉన్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే చెప్పారు. గ్రామ ప్రజలు కలిసి కట్టుగా తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇకపోతే గ్రామంలో ప్రజలకు అవసరాలు వాలంటీర్లు తెలుసుకోవాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటాసాని రాంభూపాల్‌రెడ్డి, స్థానిక వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.