Hyderabad : పేరుకు బర్త్ డే పార్టీ.. కానీ చేసింది ఏంటి.. బీటెక్ విద్యార్థుల రేవ్ పార్టీ.. పోలీసులకు ఎలా దొరికిపోయారంటే?
Hyderabad : హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్, పబ్ కల్చర్, రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగింది. దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అటువంటి కల్చర్ ను పారదోలుతున్నారు. నగరంలో, నగర శివారులో ఉన్న ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులే డ్రగ్స్, రేవ్ పార్టీలకు అలవాటు పడుతున్నారు. తాజాగా హయత్ నగర్ లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు ఛేదించారు. పుట్టిన రోజు వేడుకల పేరుతో కొందరు యువకులు.. రేవ్ పార్టీని నిర్వహించారు. అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు. అక్కడ అసాంఘీక కార్యకలాపాలకు యువకులు పాల్పడినట్టు తెలిసింది. డ్రగ్స్ తీసుకొని యువతి, యువకులు వికృత చేష్టలకు పాల్పడుతుండగా పోలీసులు రైడ్ చేశారు.
ఎక్కువ మంది యువకులు, నలుగురు యువతులు ఆ పార్టీలో ఉన్నారు. వీళ్లంతా రిచ్ కిడ్స్ లా తెలుస్తోంది. వీళ్ల నుంచి 11 కార్లు, బైకులు, మొబైల్ ఫోన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించి వాళ్ల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.
Hyderabad : చెలరేగిపోయిన యువకుడు
అయితే పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు చెలరేగిపోయాడు. పోలీసులతో దురుసగా ప్రవర్తించాడు. హయత్ నగర్ కు సమీపంలోని ఓ రిసార్ట్ లో యువతీయువకులు గంజాయి సేవిస్తున్నట్టు పక్కా సమాచారం అందింది. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు తెలియడంతో పోలీసులు రైడ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. విద్యార్థులు ఇలా రేవ్ పార్టీ నిర్వహించి పెడదారి పట్టడంతో పెద్దలు ఆందోళన చెందుతున్నారు.