Hyderabad : ఉస్మానియా యూనివర్సిటీలో ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణ అకాడమీ.. ఎప్పుడు ప్రారంభం కానుందంటే?
Hyderabad : చాలామంది విద్యార్థులు ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఇప్పుడు చిన్న టౌన్లలో కూడా సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాలు వెలిశాయి. అయితే.. సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించడం అంత ఈజీ కాదు. దానికి చాలా శ్రమించాలి. అందుకే.. ఉస్మానియా యూనివర్సిటీ తమ విద్యార్థుల కోసం సివిల్ సర్వీసెస్ లో ఉచితంగా శిక్షణను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పలు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణను అందిస్తున్న ఓయూ.. త్వరలో తమ యూనివర్సిటీ విద్యార్థుల కోసం సివిల్ సర్వీసెస్ శిక్షణను కూడా అందించనుంది.

free civil services coaching to osmania university students
ఇప్పటికే యూనివర్సిటీలోని ఓ భవనాన్ని శిక్షణ కోసం ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలో చేరే ప్రతి ఒక్క స్టూడెంట్.. ఈ సివిల్ సర్వీసెస్ శిక్షణను వినియోగించుకోవచ్చు. మరో వారం రోజుల్లో శిక్షణా అకాడెమీని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించనున్నారు. సివిల్ సర్వీసెస్ శిక్షణ అకాడెమీకి డైరెక్టర్ గా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ చింతా గణేశ్ ను నియమించింది వర్సిటీ.
Hyderabad : ఒకేసారి 1000 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు
ఒకేసారి కనీసం 1000 మంది కూర్చొనేలా.. వాళ్లకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెంట్రల్ వర్క్ షాపు భవనాన్ని సివిల్స్ శిక్షణ కోసం వినియోగించనున్నారు. ట్రెయినింగ్ కోసం సపరేట్ స్టేజ్, ప్రొజెక్టర్ లాంటి ఏర్పాట్లను అధికారులు కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా ఓయూలో శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్ వన్ శిక్షణను కూడా అందిస్తున్నారు. అయితే.. సివిల్స్ కోసం మాత్రం ముందు స్టూడెంట్స్ కు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. అందులో పాస్ అయిన వాళ్లను సివిల్స్ శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. వచ్చే సంవత్సరం జూన్ లేదా జులైలో సివిల్స్ 2023 ప్రిలిమ్స్ జరుగనుంది కాబట్టి.. త్వరలోనే ఓయూలో సివిల్స్ శిక్షణా తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.