ఫార్మర్స్ స్పెషల్.. హైదరాబాద్ ఐఐటీ వినూత్న ఆవిష్కరణ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఫార్మర్స్ స్పెషల్.. హైదరాబాద్ ఐఐటీ వినూత్న ఆవిష్కరణ..

 Authored By praveen | The Telugu News | Updated on :3 September 2021,12:57 pm

 

రోజురోజుకూ ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే కాలుష్యం బాగా పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భవిష్యత్తులో మానవాళి మనుగడుకు ముప్పు పొంచి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌పైన దృష్టి సారించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. కాగా, పలు సంస్థలు ఇప్పటికే ఆ పనిలో పడ్డాయి. హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా రైతుల కోసమై ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. ఫార్మర్స్‌కు ఈ ఇనిషియేటివ్ ద్వారా మంచి యూజ్ ఉంటుందని ఐఐటీ హైదరాబాద్ వారు పేర్కొంటున్నారు.

అగ్రికల్చర్ చేసే టైంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలతో బయో బ్రిక్స్‌ (ఇటుకలు)ను రూపొందించారు.హైదరాబాద్‌ ఐఐటీ స్టూడెంట్స్.. అయితే, ఇందుకుగాను చెత్తను ప్రత్యేకంగా సేకరించి పద్ధతి ప్రకారం మిక్స్ చేయాల్సి ఉంటుంది. అలా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఓ వైపు వ్యవసాయం మరో వైపు ఇటుకలు రెండిటి ద్వారా ఇన్‌కమ్ వస్తుంది.
ఐఐటీ హైదరాబాద్ వారు ‘బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్‌మెంట్ (బిల్డ్)’ పేరుతో ఈ ప్రత్యేక ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. ఇటీవల ఇలా వ్యవసాయం నుంచి సేకరించిన చెత్త ఆధారంగా తయారు చేయబడిన ఇటుకలతో హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్‌లో సెక్యురిటీకిగాను ఓ రూమ్ నిర్మించారు. కాగా, విద్యార్థులు చేసిన ఈ పనిని చూసి ప్రొఫెసర్లు మెచ్చుకుంటున్నారు. గ్రామీణ భారతానికి ఈ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది