Minister Malla Reddy : మల్లారెడ్డికి ఐటీ శాఖ నోటీసులు.. విచారణకు వెళ్లనున్న మంత్రి.. ఎంత నగదు సీజ్ చేశారంటే?
Minister Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై మొన్న, నిన్న ఐటీ శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు రోజుల పాటు ఆయన ఇళ్లు, సన్నిహితుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. మల్లారెడ్డి వ్యాపార సంస్థలపై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భాగంగా దొరికిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే విచారణకు హాజరు కావాలని మల్లారెడ్డికి ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది.

income tax officers notice to telangana minister malla reddy
మంగళవారం ఉదయం నుంచి మల్లారెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు వరుసగా తనిఖీలు నిర్వహించడంపై ఇది రాజకీయ కక్ష అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మల్లారెడ్డి కోడలు, ఆయన సమీప బంధువు ఇంట్లో కూడా నిర్వహించిన తనిఖీల్లో కోట్ల రూపాయలు దొరికినట్టు సమాచారం.
Minister Malla Reddy : మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవహారాలపై ఆరా
మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవహారాలను ప్రవీణ్ అనే వ్యక్తి చూసుకుంటాడు. ఆయన మల్లారెడ్డికి సన్నిహితుడు. ఆయన ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంట్లో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు అన్ని దాడుల్లో ఐటీ అధికారులకు రూ.8.80 కోట్ల నగదు దొరికినట్టు సమాచారం. ఇంకా కొనసాగుతున్న ఈ దాడులకు ఐటీ శాఖ అధికారులు ఎప్పుడు ముగింపు పలుకుతారో వేచి చూడాల్సిందే.