Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోలో రోజూ ప్రయాణిస్తున్నారా? మీకోసమే బంపర్ ఆఫర్.. ఏంటో తెలుసుకోండి
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో గురించి తెలుసు కదా.. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాఫిక్ ను తప్పించుకొని ప్రయాణించే వెసులుబాటు మెట్రో ద్వారా లభించింది. ఇదివరకు ఉప్పల్ నుంచి మాదాపూర్, హైటెక్ సెటీ వైపు వెళ్లాలన్నా.. మియాపూర్ సైడ్ వెళ్లాలన్నా గంటలకు గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ట్రాఫిక్ లో చిక్కుకుపోయేది. కానీ.. మెట్రో వల్ల సుసాధ్యం అయిపోయింది. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా హాయిగా ప్రయాణించే వీలు వచ్చింది. అయితే.. మెట్రో హైదరాబాద్ లో ప్రారంభం అయి 5 ఏళ్లు అవుతుంది.

loyalty bonus to be paid to loyal customers in hyderabad metro rail
5 ఏళ్ల వార్షికోత్సవాలను కూడా మెట్రో జరుపుతోంది. ఈనేపథ్యంలో మెట్రోలో ప్రయాణించే లాయల్టీ కస్టమర్లకు లాయల్టీ బోనస్ ను ప్రకటించింది మెట్రో. లాయల్టీ కస్టమర్ల పేరుతో స్మార్ట్ కార్డ్ ఐడీల లిస్ట్ ను మెట్రో తీసుకొచ్చింది. కొన్ని స్మార్ట్ కార్డులను ఈ లాయల్టీ ప్రోగ్రామ్ కోసం సెలెక్ట్ చేశారు.
Hyderabad Metro : మీ స్మార్ట్ కార్డ్ ఐడీ సెలెక్ట్ అయిందో లేదో తెలుసుకోండిలా
మీ స్మార్ట్ కార్డ్ ఐడీ ఒకవేళ సెలెక్ట్ అయితే.. మెట్రో అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఈనెల అంటే నవంబర్ 28 న మధ్యాహ్నం 1 గంట లోపు 040-23332555, 7995999533 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని మెట్రో అధికారులు తెలిపారు. ఇక సెలెక్ట్ అయిన స్మార్ట్ కార్డ్ ఐడీలు ఇవే. ఈ ఐడీలకే లాయల్టీ బోనస్ ను ప్రకటించారు.
- 10100003890119
- 101000010715659
- 10100001417850
- 10100004374980
- 10100000006433
- 10100001930276
- 10100002449022
- 101000011214385
- 10100002975875