Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో రూట్.. ఎక్కడో తెలుసా?
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే రాయదుర్గం, శంషాబాద్ మెట్రో రూట్ కు సంబంధించి పనులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్నారు. అది 31 కిలోమీటర్ల మేర నిర్మించబోయే మెట్రో కారిడార్. అయితే.. ఆ మెట్రో కారిడార్ లో భాగంగా కొన్ని కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించబోతున్నారు.
నిజానికి హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో లేదు. ఢిల్లీ, బెంగళూరులో ఇప్పటికే కొన్ని కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. కానీ.. హైదరాబాద్ లో లేదు. కోఠి, సుల్తాన్ బజార్ ప్రాంతంలో అప్పట్లోనే అండర్ గ్రౌండ్ రూట్ నిర్మించాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఇప్పుడు రాయదుర్గం, శంషాబాద్ రూట్ లో ఎయిర్ పోర్ట్ దగ్గర 2.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రోను నిర్మించనున్నారు.
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోలో రోజుకు ప్రయాణిస్తున్న వాళ్ల సంఖ్య 4 లక్షలు
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నిజానికి కరోనా కంటే ముందు ఎక్కువ మందే ప్రయాణించేవారు. ఇప్పుడు రద్దీ తగ్గింది. కానీ.. పీక్ అవర్స్ లో మాత్రం మెట్రోలో రష్ ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలంటే ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ బస్సు లేదంటే క్యాబ్, సొంత వాహనాల మీదనే ఆధారపడాలి. అందుకే.. ఎయిర్ పోర్ట్ కు మెట్రో సౌకర్యాన్ని కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఈ మెట్రో కారిడార్ కు రూ.6250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దాని కోసం ఖర్చయ్యే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.