YS Sharmila : తమాషాలు చేస్తున్నారా.. నా బిడ్డను చూడానికి వెళ్తున్న.. పోలీసులపై విజయమ్మ ఫైర్..!
YS Sharmila : వైఎస్సార్‌టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిలనీ ధ్వంసమైన కారుతో సహా హైదరాబాద్ పోలీసులు క్రేన్ సహాయంతో కారులో కూర్చున్న ఆమెను పోలీస్ స్టేషన్ కి తరలించడం తెలిసిందే. మరోపక్క అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లు ఎక్కడికక్కడ సమస్యలు సృష్టించటంతో… షర్మిల పాదయాత్ర తెలంగాణలో సంచలనంగా మారింది. నరసన్నపేట లో జరిగిన పాదయాత్రలో షర్మిల కారుపై టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు దాడులు చేయటంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ లోటస్ పాండ్ కి తరలించడం జరిగింది.
అయితే ఈరోజు షర్మిల ధ్వంసమైన తన కారుతో ప్రగతి భవన్ వద్ద నిరసన చేపట్టడానికి బయలుదేరిన క్రమంలో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు మధ్య… ఆమెను అరెస్టు చేశారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. దీంతో వైయస్ విజయమ్మ… రంగంలోకి దిగారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు వైయస్ విజయమ్మ ప్రయత్నం చేయటంతో పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన వైయస్ విజయమ్మ ఎక్కడ కూడా షర్మిల…!
పరుష పదజాలాలు వాడలేదని తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుని.. ఎందుకు కాలరాస్తున్నారు అని విజయమ్మ నిలదీశారు. నా కూతురిని చూడటానికి వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారని మండిపడ్డారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను పాదయాత్రలో షర్మిల ప్రశ్నిస్తుంది. దానికి ఈ రీతిగా పోలీసులు అడ్డుపడి అరెస్టు చేయటం సరైనది కాదని మండిపడ్డారు. పోలీసులు ఇలా చేయటం తప్పు అని విజయమ్మ పేర్కొన్నారు.