Blind Family Story : ఆ కుటుంబం మొత్తం అంధులే.. పాట‌లే జీవ‌నాధారం.. వీరి పాట‌లు వింటే క‌న్నీళ్లు ఆగ‌వు.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Blind Family Story : ఆ కుటుంబం మొత్తం అంధులే.. పాట‌లే జీవ‌నాధారం.. వీరి పాట‌లు వింటే క‌న్నీళ్లు ఆగ‌వు.. వీడియో..!

 Authored By aruna | The Telugu News | Updated on :2 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Blind Family Story : ఆ కుటుంబం మొత్తం అంధులే.. పాట‌లే జీవ‌నాధారం.. వీరి పాట‌లు వింటే క‌న్నీళ్లు ఆగ‌వు.. వీడియో..!

Blind Family Story : చాలామంది కాళ్లు చేతులు కళ్ళు అన్ని సక్రమంగా ఉన్నాగాని పని చేసుకోలేని పరిస్థితి. కానీ ఒకే కుటుంబంలో నలుగురు అందులో ఉన్నారు. ఆ నలుగురు జీవనం సాగేందుకు పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ల కుటుంబ పెద్ద అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూలి పనులు చేసుకుంటాఆ నలుగురిని కాపాడుతున్నారు. నలుగురిలో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న పాషా మరియు లలితమ్మ విజయవాడలో ఒక ప్రోగ్రాం లో ఇద్దరు పరిచయమై లలితమ్మను వివాహం చేసుకోవాలి అని భాష నిర్ణయించుకున్నాడు.

ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించి లలితమ్మను వివాహం ఆడాడు ఇప్పుడు వారు ఇద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. వైరా నియోజకవర్గ సింగరాయపాలెం కి చెందిన పాషా అలాగే లలిత వీరిద్దరూ ఎంతో చక్కగా పాటలు పాడుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. వారికి ఇప్పుడు వరకు గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదట. కేవలం భాషకు మాత్రమే 4000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు లలితకు మాత్రం ప్రజెంట్ ఆమెకి ఇంకా పెన్షన్ కాలేదు. ఇట్లా ప్రోగ్రాం చేసుకుంటేనే మా జీవనాధారం గడుస్తుంది. లైవ్ లో లలిత “అమ్మ గురించి నా కమ్మని కావ్యం ఎవరు పాడగలరు” అనే పాట చాలా చక్కగా పాడారు.

ఈ విధంగా పాటలు పాడుతుంటే చాలామంది మీరు నటిస్తున్నారు మ్యూజిక్ మీరు పాడిన పాటలు కావు అది ఇదని వారిని అన్నట్టు చాలామంది విమర్శిస్తున్నారు. దాని గురించి ఆ పాట ఎలా వస్తుంది. ఓన్లీ ఇందులో మ్యూజిక్కే వస్తది. మమ్మల్ని చాలా విమర్శిస్తున్నారు. నేను మీరు లలితమ్మ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. లైవ్ లో పాషా కూడా” జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది”అతను కూడా చాలా చక్కగా పాటలు పాడారు. నాకు ఎవరు ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు.. మమ్మల్ని అర్థం చేసుకొని గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని లలిత పాష కోరుతున్నారు.. అలాగే మేము నిరుపేదలము మాకు నటించాల్సిన అవసరం లేదు.. మాకు వచ్చింది నేను చేస్తున్నామని దయచేసి ఎవరు? హేళన చేయకండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది