SBI : రేషన్ కార్డు ఉందా..? నిరుద్యోగ యువతకు ఎస్బిఐ శుభవార్త…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI : రేషన్ కార్డు ఉందా..? నిరుద్యోగ యువతకు ఎస్బిఐ శుభవార్త…!

 Authored By ramu | The Telugu News | Updated on :4 May 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  SBI : నిరుద్యోగ యువతకు ఎస్బిఐ శుభవార్త... ఉచితంగా ఉపాధి శిక్షణ...!

SBI : ప్రస్తుత కాలంలో చాలామంది ఉద్యోగాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో చిన్న ఉద్యోగం వచ్చిన చాలు అనే భావనలో కొందరు ఉంటే మంచి జీతంతో మంచి జాబ్ దొరికితే బాగుండు అని కొందరు అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే కొన్ని రకాల బ్యాంకులు ప్రైవేట్ సంస్థలు ఇలాంటి వారికి అదిరిపోయే శుభవార్తలు తీసుకువచాయి. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువతకు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తాజాగా రేషన్ కార్డు కలిగి ఉండి 18 ఏళ్లు నిండిన వారికి ఒక శుభవార్త తీసుకువచ్చాం. మీకు రేషన్ కార్డు ఉంటే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ బ్యాంకులలో ఒకటైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నిరుద్యోగుల కోసం ఒక శుభవార్తను తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేసవి కాలంలో జాబు లేదా ఉపాధి పొందే విధంగా అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ట్రైనింగ్ ను ఉచితంగా అందించనుంది. ఇక ఈ వేసవి కాలంలో దాదాపు నెలరోజులు పాటు దీనికి సంబంధించిన ట్రైనింగ్ శిక్షణ ఉచితంగా ఉంటుంది.

SBI : వారికి మాత్రమే అవకాశం…

అయితే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 18న ప్రారంభించగా ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. ఇక ఈ ఉచిత శిక్షణ కేవలం సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలో ఉండే వారికి మాత్రమే. ఇక ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న యువతకు ఈ అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హత ఉండాలంటే వారి వయసు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అంతేకాదు ఈ ఉచిత శిక్షణ సమయంలో వసతి మరియు ఉచిత భోజన సౌకర్యం కూడా వారే కల్పిస్తారు.అంతేకాదు ఉచితంగా యూనిఫామ్ మరియు ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ కూడా అందిస్తారు. అలాగే ట్రైనింగ్ ముగిసిన తర్వాత టూల్ కిట్ కూడా ఉచితంగా అందిస్తామని SBRSETI డైరెక్టర్ వంగా రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.

SBI రేషన్ కార్డు ఉందా నిరుద్యోగ యువతకు ఎస్బిఐ శుభవార్త

SBI : రేషన్ కార్డు ఉందా..? నిరుద్యోగ యువతకు ఎస్బిఐ శుభవార్త…!

SBI : దరఖాస్తు ప్రక్రియ…

ఇక ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు కీలక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ ,ఆధార్ కార్డు, పదో తరగతి మెమో ,నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలను సమర్పించాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది