Karimnagar..జిల్లా పరిస్థితులపై ఎంపీ సంజయ్ సమీక్ష

0
Advertisement

కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం రాత్రి, మంగళవారం పొద్దున కురిసన వానలకు పంటలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో విపత్కర పరిస్థితులపై బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సమీక్షించారు. మంగళవారం ఫోన్‌లో కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు తరలించేందుకు యుద్ధప్రాతిపదకన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ సంజయ్ ఆదేశించారు.

ముంపు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇకపోతే ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రస్తుతం ‘ప్రజా సంగ్రామ యాత్ర’పేరిట చేస్తున్న పాదయాత్రలో బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే. తాజాగా ‘బండి’ పాదయాత్రలో వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున వంద కేజీల కేకును బీజేపీ శ్రేణుల మధ్య కట్ చేశారు. ఇక పోతే ఈ పాదయాత్రలో బీజేపీ శ్రేణులు, ప్రజలు పాల్గొంటున్నారు. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాదయాత్రలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు.

 

Advertisement