Kurnool.. శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామికి ఒకటిన్నర కిలోల వెండి పడగ విరాళం
జిల్లాలోని పాణ్యం మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్ స్థానికంగా బాగా ఫేమస్. కాగా, ఈ ఆలయ దర్శనార్థం భక్తులు పోటెత్తుతుంటారు. స్వామి వారి దర్శన భాగ్యం చేత తమకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కాగా, ఈ ఆలయానిక 1.30 కిలోల వెండిపడగను విరాళంగా అందించాడు ఓ భక్తుడు. మరో భక్తుడు రూ. యాభై వేల నగదు ఇచ్చారు. ఈ మేరకు ఆలయ ఈఓ తెలిపారు.
నంద్యాల సిటీలోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన అల్లెనంద కిశోర్ రెడ్డి వెండి నాగ పడగ ఇచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. రూ. యాభై వేల నగదును కాకినాడ సిటీ పాపప్నదొర కాలనీకి చెందిన శ్రీనివాసులు శెట్టి ఇచ్చినట్లు తెలిపారు. నగదును ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు ఆలయ ఈఓ చెప్పారు. ఇకపోతే వెండి పడగను శాస్త్రోక్తంగా స్వామి వారికి సమర్పించనున్నట్లు తెలిపారు. శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి స్థానికంగా ఉండే భక్తులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారని ఈఓ పేర్కొన్నారు.