Ys Jagan : విడ్డూరం.. సీఎం జగన్‌ ఆదేశించాడు.. చిరు, నాగార్జున పాటించారు

Advertisement

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు.. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) మరియు టాలీవుడ్ కింగ్ నాగార్జున  ( nagarjuna )ఆచరించారు అంటూ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల అనంతపురం లో జరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించారు. రెండు పెద్ద హీరోల సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు అనంతపురం మరియు కర్నూలు లో జరగడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. హైదరాబాదులో ఎన్నో సౌకర్యాల మధ్య నిర్వహించాల్సిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎందుకు తీసుకు వెళ్లి అక్కడ నిర్వహించారు అనేది లక్షలాది మంది ప్రశ్న.

Advertisement

ఆ ప్రశ్నకు తాజాగా వినిపిస్తున్న గుసగుసలు సమాధానం అనిపిస్తున్నాయి. ఆ మధ్య టికెట్ల రేట్లు పెంచాలంటూ ఏపీకి చిరంజీవి మరియు నాగార్జున ఇంకొందరు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే సీఎం జగన్ టికెట్ల రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని కండిషన్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాల యొక్క షూటింగ్ మరియు ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగితేనే ఏపీలో వాళ్ళ యొక్క సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది.. కనుక షూటింగ్ అక్కడ చేయాల్సిన అవసరం ఉన్నా లేకున్నా ఏపీలో నిర్వహించాల్సిందే అంటూ ఇండస్ట్రీకి ఏపీ కఠిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే గాడ్ ఫాదర్ సినిమాలోని పలు సన్నివేశాలను ఏపీలో తెరకెక్కించారు.

Advertisement
ap cm ordered to chiranjeevi and nagarjuna and they did it
ap cm ordered to chiranjeevi and nagarjuna and they did it

అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపురంలో నిర్వహించారు, కొందరు ఏపీలో సినిమా వేడుకలు జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తుంటే.. ఇండస్ట్రీకి చెందిన కొంత మంది మాత్రం జగన్ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ఆదేశించినంత మాత్రాన చిరంజీవి మరియు నాగార్జున వెళ్లి అక్కడ తమ సినిమాల యొక్క ఈవెంట్స్ నిర్వహించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇండస్ట్రీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఏపీలో తమ సినిమాల యొక్క ఈవెంట్స్ నిర్వహించి ఏపీ ప్రభుత్వానికి తెలుగు సినిమా పరిశ్రమపై ప్రేమ కలిగేలా చేశారంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున మరియు చిరంజీవి కాస్త తగ్గినట్లుగానే కనిపించినా ఇండస్ట్రీ పరంగా వారు చాలా ఎత్తుకెదిగారనే చెప్పాలి.

Advertisement
Advertisement