Khammam.. ప్రజలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే రేగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Khammam.. ప్రజలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే రేగా

 Authored By praveen | The Telugu News | Updated on :5 September 2021,1:04 pm

జిల్లాలోని పినపాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రజలతో ముచ్చటించారు పినపాక శాసన సభ్యుడు రేగా కాంతారావు. నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక మండలాల్లోని ప్రజల వద్దకు వెళ్లారు. ఆయా గ్రామాల్లో వివిధా కారణాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పలకరించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎవరికీ ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఎవరూ అధైర్య పడల్సిన అవసరం లేదని, సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తానని పేర్కొన్నారు ఎమ్మెల్యే రేగా. ప్రజలు తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టీఆర్ఎస్ పార్టీ నేతల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ పర్యటనలో శాసన సభ్యుడు రేగా కాంతారావు వెంట టీఆర్ఎస్ పార్టీల ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.

Advertisement
WhatsApp Group Join Now

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది