Khammam..‘కిన్నెరసాని’కి జలకళ
జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవానలకుగాను ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతున్నది. కిన్నెరసాని డ్యాం సామర్థ్యం 407 అడుగులు కాగా 405 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా నీరు బాగానే వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే డ్యాం నుంచి నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇప్పటికే ఇరవై ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఇకపోతే లోతట్టు ప్రాంతాల్లో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు […]
జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవానలకుగాను ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతున్నది. కిన్నెరసాని డ్యాం సామర్థ్యం 407 అడుగులు కాగా 405 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా నీరు బాగానే వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే డ్యాం నుంచి నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇప్పటికే ఇరవై ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఆఫీసర్లు తెలిపారు.
ఇకపోతే లోతట్టు ప్రాంతాల్లో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాగులు, వంకలతో పాటు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారిపోతున్నాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ప్రజలకు సాయం చేసేందుకుగాను పలు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలకు పంట నష్టం జరిగే చాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే ఈ వానల సమయంలో రైతుల కరెంటు మోటార్లు, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.