Krishna..క్రీడలతో మానసికోల్లాసం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krishna..క్రీడలతో మానసికోల్లాసం..

 Authored By praveen | The Telugu News | Updated on :10 September 2021,10:45 pm

ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరు కాంపిటీటివ్ ఎడ్యుకేషన్‌పైన దృష్టి పెడుతున్నారని, అయితే, వాటి కంటే కూడా స్పోర్ట్స్‌పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ ప్రెసెడెంట్ శ్యామ్ కిషోర్ అన్నారు. శుక్రవారం శ్యామ్ జిల్లాలోని ఘంటసాల మహాత్మగాంధీ జెడ్పీ హై స్కూల్‌కు చెందిన 32 మంది సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు సుమారూ రూ.పది వేలు విలువ చేసే స్పోర్ట్స్ టీషర్ట్స్ అందజేశారు. త్వరలో జరగనున్న పేర్ని కృష్ణమూర్తి మొమోరియల్ టోర్నీలో కృష్ణా జట్టు విజేతలుగా నిలవాలని శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. పిల్లలు విద్యార్థి దశలో ఉన్నపుడు స్పోర్ట్స్‌పై కాన్సంట్రేట్ చేయాలని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు పిల్లలకు చాలా ముఖ్యమైన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన తెలిపారు. చదువుతో పాటు స్పోర్ట్స్ పట్ల కూడా దృష్టి సారించాలని తద్వారా శారీరక, మానసిక ఎదుగుదల సాధ్యమని పేర్కొన్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది