Krishna.. మరిన్ని టెంపుల్స్‌లో ఆన్‌లైన్ పూజలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krishna.. మరిన్ని టెంపుల్స్‌లో ఆన్‌లైన్ పూజలు..

 Authored By praveen | The Telugu News | Updated on :5 September 2021,9:00 am

ప్రజెంట్ బిజీ లైఫ్‌లో ప్రతీ పని ఫిజికల్‌గా కంటే కూడా డిజిటల్ చేసేందుకు జనాలు ఇష్టపడుతుండటం మనం చూడొచ్చు. విద్యుత్ బిల్లులు కట్టడం నుంచి మొదలుకుని సామగ్రి తెచ్చుకోవడం వరకు అన్ని పనులు ఆన్‌లైన్ వేదికగానే చేస్తున్నారు. ఈ క్రమంలోనే దైవ దర్శనం, పూజలు కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలోని ప్రముఖ టెంపుల్స్‌లో సేవలు, పూజలు ఆన్‌లైన్ వేదికగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చేసుకునే విధంగా భక్తలకు అవకాశం కల్పించినట్లు ఏపీ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ పి.వాణీమోహన్ తెలిపారు.

 

ఆమె కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ఆలయాల్లో గత మూడు నెలలుగా ఆన్‌లైన్ సేవలు అందుతుండగా, మరో 180 టెంపుల్స్‌లో కొత్తగా ఆన్‌లైన్ సేవలు షురూ చేస్తున్నట్లు తెలిపారు. ఫేమస్ టెంపుల్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. లక్ష్మీతిరుపతమ్మ ఆలయ ఈవో ఈ సందర్రభంగా కమిషనర్ వాణీమోహన్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు ఇచ్చి సన్మానం చేశారు.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది