కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం తెంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. తెంపల్లిలో ఉన్న విజయ పాలిమర్స్ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కంపెనీకి సమీపంలోనే మరిన్ని పరిశ్రమలు ఉన్నాయి. అయితే, పవర్ షార్ట్ సర్క్యూట్ అవడం వల్లే కంపెనీలో మంటలు చెలరేగి క్రమంగా కంపెనీ పరిసరాల్లో విస్తరించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకుగాను స్థానికుల సాయం తీసుకుంటున్నారు. అయితే, పాలిమర్స్ కంపెనీ సమీపంలోనే మరిన్ని ఇండస్ట్రీలు ఉండటం వల్ల వాటిలోనూ మంటలు చెలరేగే చాన్సెస్ ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విజయ పాలిమర్స్ కంపెనీ టవల్స్, క్లాత్ మెటీరియల్స్ తయారుచేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, కంపెనీలో ఉండే మెటీరియల్ వల్లే మంటలు ఈజీగా అంటుకున్నట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు పోలీసులు. ఇకపోతే ఇప్పటికే విజయ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణంలో మంటల వల్ల దట్టమైన పొగ అలుముకుని ఉంది. ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ, మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలుసుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, క్రీడా, హైల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్తలు రాస్తారు. గతంలో ప్రముఖ తెలుగు మీడియా సంస్థలో అనుభవం కూడా ఉంది