పవన్ కళ్యాణ్ సినిమా ఎన్నో కోట్ల మంది చూస్తారట.. అందుకే అడివి శేష్ నటించాడట

Advertisement

అడివి శేష్ అంటే అందరికీ దాదాపుగా పంజా సినిమా విలన్ అని గుర్తుపట్టేవారు. క్షణం, గూఢాచారి, ఎవరు వంటి సినిమాలతో ఇప్పుడంటే స్టార్డం సంపాదించుకున్నాడు. కానీ అంతకు ముందు పంజా విలన్‌గానే గుర్తింపు తెచ్చుకున్నాడు. పంజా కంటే ముందుగా కర్మ అనే సినిమాను చేసినా ఎవ్వరికీ తెలియకుండానే పోయింది. అలాంటి సమయంలో పంజా సినిమా ఆఫర్ వచ్చిందట. కానీ అందులో విలన్ పాత్ర అని చేసేందుకు ఒప్పుకోలేదట.

Advertisement
పవన్ కళ్యాణ్ సినిమా ఎన్నో కోట్ల మంది చూస్తారట.. అందుకే అడివి శేష్ నటించాడట
Adivi sesh about Pawan kalyan Panja Movie offer

నాటి విషయాన్ని తాజాగా అడివి శేష్ పంచుకున్నాడు.‘పంజా’లో విలన్‌ పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను మొదట చేయకూడదనుకున్నా. ఆ విషయాన్నే నా కజిన్‌కు చెబితే.. ‘పవన్ కళ్యాణ్ సినిమా ఎన్నో కోట్ల మంది చూస్తారు. నటన బాగుంటే నీకు గుర్తింపు వస్తుంది’ అని చెప్పాడు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా ఓకే అన్నాను. నిజం చెప్పాలంటే ‘పంజా’ నాకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిందంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా తర్వాత విలన్‌, విలన్‌ కొడుకుగా చేయమని ఆఫర్స్‌ వచ్చాయని, కానీ చేయలేదంటూ తెలిపాడు.

Advertisement

ఇప్పుడు అడివి శేష్ సినిమా అంటే ఓ బ్రాండ్ ఏర్పడింది. టాలీవుడ్‌లో అతి చిన్న బడ్జెట్‌లోనే ఇంటర్నేషన్ స్థాయిలో సినిమాలను తెరకెక్కించగలమని నిరూపించేశాడు. గూఢచారి, క్షణం వంటి సినిమాలు అడివి శేష్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. తాజాగా మేజర్ సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. 26/11 ఉగ్రదాడిలో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణణ్ బయోపిక్ ఆధారంగా మేజర్ చిత్రం రూపొందుతోంది.

Advertisement
Advertisement