Rajendra Prasad : ప్రమోషన్ లో తన పోస్టర్ లేదని రాజేంద్రప్రసాద్ అసంతృప్తి
ప్రధానాంశాలు:
Rajendra Prasad : ప్రమోషన్ లో తన పోస్టర్ లేదని రాజేంద్రప్రసాద్ అసంతృప్తి
Rajendra Prasad : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి వెంకీ కుడుముల దర్శకత్వంలో. రాబిన్ హుడ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని సాంగ్స్ , టీజర్స్ , ప్రమోషన్స్ ఇలా ప్రతిదీ సీనిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. తాజాగా జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Rajendra Prasad : ప్రమోషన్ లో తన పోస్టర్ లేదని రాజేంద్రప్రసాద్ అసంతృప్తి
ప్రమోషన్ కార్యక్రమంలో ఎక్కడ కూడా తన బొమ్మ కానీ , పోస్టర్ కానీ కనిపించలేదని అంటే..వెంటనే పక్కనే ఉన్న శ్రీలీల మిమల్ని చూడాలంటే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాలి అందుకే పోస్టర్ పెట్టలేదు అని చెప్పి అందర్నీ నవ్వించింది. శ్రీలీల చెప్పిన సమాధానంకు రాజేంద్ర ప్రసాద్ కూడా నవ్వుకున్నాడు. మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. రీసెంటుగా ఈ సినిమా నుంచి ‘అది దా సర్ ప్రైజ్’ అనే సాంగ్ ను వదిలారు. ఇది సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే స్పెషల్ సాంగ్.
కేతిక శర్మ బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. జీవీ ప్రకాశ్ కుమార్ బాణీ కట్టిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీని అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో తెగ చక్కర్లు కొడుతుంది.