ఇండస్ట్రీలో ఉండాలంటే అది తప్పదు.. చంద్రమోహన్ కామెంట్స్
Chandra Mohan : హీరోగా, నటుడిగా, కమెడియన్‌గా ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు చంద్రమోహన్ Chandra Mohan . ప్రతినాయకుడి పాత్రలోనూ చంద్రమోహన్ ఆకట్టుకున్నారు. మనకు దాదాపు హీరో, కమెడియన్‌గా మాత్రమే తెలిసిన చంద్రమోహన్ ప్రతినాయకుడిగానూ మెప్పించారు. ‘గంగ మంగ’తో పాటు జయసుధ నటించిన ‘లక్ష్మణరేఖ’లో ఆయనది నెగెటివ్ రోల్. అలా అన్ని రకాల పాత్రలను చంద్రమోహన్ పోషించారు. మరీ ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులకు ఆయన మంచి కమెడియన్‌గా పరిచయం.
అలాంటి చంద్రమోహన్ Chandra Mohan ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటంతో సినిమాలను పక్కన పెట్టేశారు. కానీ ఇంకా నటించాలనే కోరిక ఉందని ఆ మధ్య చెప్పుకొచ్చారు. నేడు ఆయన పుట్టిన రోజు. 1945లో జన్మించిన చంద్రమోహన్ మే 23తో 76వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈసందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు.
హీరోగా మాత్రమే చేయాలని అనుకుంటే ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉండేవాడిని కాదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ కాక తప్పదు. దాదాపు 50 సంవత్సరాలు నిర్విరామంగా పని చేశాను. నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశా. ఎవరైనా హెచ్చరించినా.. ఇనుముకు చెదలు పడుతుందా? అని వెటకారం చేసేవాడిని. కానీ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆ తర్వాత తెలిసింది అంటూ తన పాత విషయాలను తలుచుకున్నారు.