Anushka : వింత వ్యాధికి గురైన హీరోయిన్ అనుష్క..!!
Anushka: 2005 వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సినిమా “సూపర్”. బైక్ రేస్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి అవకాశాలు అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు పెద్ద హీరోల అందరి సరసన నటించడం జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో తిరుగులేని హిట్ పెయిర్ లో ప్రభాస్ అనుష్క ది ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “బాహుబలి” భారతీయ చలన చిత్రా రంగంలోనే చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఈ సినిమాలో రాణి పాత్రలో అనుష్క తన పెర్ఫార్మెన్స్ తో విశ్వరూపం చూపించింది.
ఇక ఈ సినిమా తర్వాత “సైజ్ జీరో” అనే ప్రయోగాత్మక సినిమా చేసి పరాజయం పాలై ప్రస్తుతం అవకాశాలు లేక సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఇటీవల ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు అనారోగ్యానికి గురి కావడం తెలిసిందే. హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురై దాదాపు మూడు నెలల నుండి చికిత్స తీసుకుంటుంది. సీనియర్ హీరోయిన్ భానుప్రియ భర్త చనిపోయాక మతిమరుపుతో బాధపడుతున్నట్లు ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తానూ గుండెకు సంబంధించి వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

Heroine Anushka shetty is suffering from a strange disease
ఇదిలా ఉంటే హీరోయిన్ అనుష్క కూడా ఓ వింత వ్యాధికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. మేటర్ లోకి వెళ్తే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. తనకున్న ఈ వింత సమస్య గురించి వెల్లడించారు. నవ్వడం మొదలుపెడితే దాదాపు 15 నుంచి 30 నిమిషాల పాటు నవ్వుని కంట్రోల్ చేసుకోలేక పోతున్నాను. దీనివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాను అని తెలిపారు. అయితే ఇది కూడా ఒక వ్యాధి యేనా అనీ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది నిజంగానే సమస్య ఉందేమోనని బాధపడుతున్నారు. ఇంటర్వ్యూలో అనుష్క ఈ రీతిగా వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు బాధపడుతున్నారు. ఈ వింత వ్యాధి నుండి త్వరగా కోలుకోవలనీ భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.