చిరంజీవి మొహం మీదే బాలేదని చెప్పాడట.. రాజా రవీంద్ర రియాక్షన్‌కు చిరు షాక్!!

Advertisement

నటుడు రాజా రవీంద్రకు టాలీవుడ్‌లో మంచి పరిచయాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజా రవీంద్ర రెండు రకాలుగా సంపాదిస్తున్నాడు. నటనతో బిజీగా ఉంటూనే.. కుర్ర హీరోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తూ ఉన్నాడు. కుర్ర హీరోల డేట్లు కావాలంటే రాజా రవీంద్ర దగ్గరకు వెళ్లాల్సిందే. అలా రాజా రవీంద్ర తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే రాజా రవీంద్రకు చిరంజీవికి మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే.

Advertisement
చిరంజీవి మొహం మీదే బాలేదని చెప్పాడట.. రాజా రవీంద్ర రియాక్షన్‌కు చిరు షాక్!!
Raja Ravindra Issue with Chiranjeevi about Sneham Kosam

రాజా రవీంద్ర ఓసారి చిరు నిర్ణయాన్ని వ్యతిరేకంగా సమాధానం ఇచ్చాడట. మొహం మీద బాలేదని చెప్పాడట. స్నేహం కోసం సినిమా తమిళంలో శరత్ కుమార్ చేశాడు. ఆ సినిమా రీమేక్‌కు చేసే సందర్భంలో రాజా రవీంద్ర అక్కడకు వచ్చాడట. ఈ మూవీని రీమేక్ చేద్దామని అనుకుంటున్నాను ఎలా ఉంటుంది చెప్పు అని చిరు అడిగాడట. బాగుండదు వద్దు అని నేరుగా చెప్పేశాడట. అలా ఎందుకు అన్నావ్ అని చిరు తరువాత అడిగాడట.

Advertisement

మీరు రజినీ కాంత్ సినిమాలను రీమేక్ చేస్తే పర్లేదు.. ఇద్దరి ఒకే లెవెల్.. కానీ శరత్ కుమార్ సినిమాను మీరు రీమేక్ చేయడమేంటి.. పైగా అందులో మీరు వేరే పాత్రధారి చెప్పులు పట్టుకోవడం, అతని ముందుకు చేతులు కట్టుకుని ఉండటం నచ్చలేదు.. అలా ఎవ్వరూ చూడలేరు రాజా రవీంద్ర చెప్పుకొచ్చాడట. చివరకు ఫలితంగా కూడా అలాగే వచ్చింది. చిరంజీవిని పని మనిషిగా, చెప్పులు తీసి పక్కన పెట్టడం, చేతులు కట్టుకోవడం వంటివి ఫ్యాన్స్ అంగీకరించలేకపోయారు. స్నేహం కోసం ఫలితం యావరేజ్‌ అయింది.

Advertisement
Advertisement