Nalgonda.. బస్సు ఫెసిలిటీ కల్పించాలని డిపో మేనేజర్‌కు వినతి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nalgonda.. బస్సు ఫెసిలిటీ కల్పించాలని డిపో మేనేజర్‌కు వినతి

 Authored By praveen | The Telugu News | Updated on :22 September 2021,3:22 pm

జిల్లాలోని మిర్యాలగూడ నుంచి నడిగడ్డకు బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కృష్ణపట్టే ప్రాంత గ్రామస్తులు మిర్యాలగూడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కోరారు. ఈ మేరకు వారు బుధవారం డిపో మేనేజర్ పాల్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయక్ తండ సర్పంచ్ కొండ నాయక్ మాట్లాడుతూ గతంలో మిర్యాలగూడ నుంచి నడిగడ్డకు బస్సు సర్వీసులు ఉండేవని తెలిపారు. ప్రస్తుతం బస్సు ఫెసిలిటీ లేకపోవడంతో దాదాపుగా పదిహేను గ్రామాల జనం, స్టూడెంట్స్ సిటీకి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. అందుచేత బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని సర్పంచ్ కొండనాయక్ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కోరారు.

కరోనా నేపథ్యంలో కొద్ది కాలం పాటు ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఆ తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభం కాగా ఆర్టీసీ బస్సులు నడవడం స్టార్ట్ అయ్యాయి. కానీ, అంతకు ముందు ఉన్న బస్సు సర్వీసులు అన్ని కూడా లేవు ప్రస్తుతం. కొన్నిటిని ఆర్టీసీ అధికారులు రద్దు చేసిన నేపథ్యంలో కొన్ని రూట్స్‌కు మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది