77th Independence Day : ఈసారి స్వాతంత్ర దినోత్సవ స్పెషాలిటీ ఏంటో తెలుసా ..??
77th Independence Day ; మన భారతదేశానికి 1947లో ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ పండుగను ఎలాంటి జాతి, కుల, మత బేధాలు లేకుండా అంతా కలిసి చేసుకుంటాం. అయితే ఈసారి 2023లో ఆగస్టు 15న 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం థీమ్ గా ‘ నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ ‘ అని థీమ్ గా పెట్టింది. అయితే ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఢిల్లీలోని ఎర్రకోటలో దేశానికి వెన్నెముక అయినా రైతులు, కార్మికులు, జాలర్లు, నర్సులు, సర్పంచ్లను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానిస్తున్నారు.
ఢిల్లీలో ఎర్రకోట పై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం స్పీచ్ ను ఇస్తారు. 2047 స్వాతంత్ర దిన దశాబ్ది ఉత్సవాల నాటికి ఇండియాని డెవలప్ చేయాలని ఈ సంవత్సరం ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపనున్నారు. ప్రతి ఇంటిలోను జాతీయ జెండా ఎగురవేయాలని, వాట్సాప్ డీపీ గా త్రివర్ణ పతాకం పెట్టాలని సూచించారు. 12 ప్రాంతాలలో సెల్ఫీ పాయింట్లు వివిధ థీమ్లతో పెట్టనున్నారు. ప్రత్యేకంగా 1800 మంది అతిథుల్ని పిలుస్తున్నారు.
ప్రధాని మోడీ ప్రతి ఇంటి ముందు త్రివర్ణ పథకాన్ని ఎగరవేయాలని సూచించారు. అలాగే వాట్సాప్ డీపీ గా ప్రతి ఒక్కరు జాతీయ జెండాను పెట్టాలని తెలిపారు. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఎంతో వైభవంగా జరిగే ఈ ఉత్సవాన్ని చూడడానికి అక్కడి చుట్టూ ప్రక్కల ప్రజలంతా వెళతారు. ప్రధాని మోదీ జెండాను ఎగురవేశాక అనంతరం మన దేశంలోని వృత్తులు వివిధ కళలను ప్రదర్శిస్తారు. వీటిని చూడడానికి ఎంతో మంది ప్రజలు అక్కడికి చేరుకుంటారు. అయితే ఈసారి స్వాతంత్ర దినోత్సవానికి దేశానికి వెన్నెముక అయినా రైతులు కార్మికులు జాలర్లు నర్సులు సర్పంచులను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానిస్తున్నారు. ఇదే ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకత.