7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.4 శాతం పెరిగిన డీఏ.. భారీగా పెరిగిన జీతాలు
7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇంతకీ ఏ రాష్ట్రం అంటారా.. అదేనండి.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకే జీతాలు పెంచుతుంటాయి. డీఏ గట్రా పెంచుతుంటాయి. తాజాగా.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇటీవల పెరిగిన డీఏ ఆధారంగానే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీఏ పెంచింది ఆ రాష్ట్ర సర్కారు. ప్రస్తుతం పెరిగిన డీఏతో కలిపితే 42 శాతం డీఏ పెరిగింది.
దానికి సంబంధించిన ప్రకటనను మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేశారు. దీని వల్ల ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం కనీసం రూ.1600 నుంచి రూ.6000 వరకు పెరగనుంది.సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సార్లు డీఏ పెరుగుతుంది. గత మార్చిలో డీఏ పెరిగింది. ఆ తర్వాత మళ్లీ జులైలో పెరిగే అవకాశం ఉంది. 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతంగా అయింది. ఇప్పుడు మళ్లీ డీఏ పెరిగితే అది 46 శాతం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లాగానే.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను రెండు సార్లు పెంచుతారు. మార్చి 15న డీఏ ఒకసారి పెరగగా.. మళ్లీ ఈనెల రెండోసారి పెరిగింది.
7th Pay Commission : మధ్య ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండు సార్లు పెరగనున్న డీఏ
ఇటీవల ఒడిశా ప్రభుత్వం కూడా డీఏ పెంచింది. 4 శాతం డీఏను పెంచింది. 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతం అయింది. గత నెలలో కర్ణాటక ప్రభుత్వం కూడా డీఏను 4 శాతం పెంచింది. పెంచిన డీఏ.. జనవరి 1, 2023 నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. కర్ణాటక రాష్ట్రం 31 శాతం నుంచి 35 శాతానికి డీఏను పెంచింది. దానికంటే ముందు జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా తమ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెంచాయి.