Amit Shah : సీఏఏ చట్టం వాళ్లకు మాత్రమే.. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం : అమిత్ షా..!
ప్రధానాంశాలు:
ఇది ముస్లింలకు వ్యతిరేకం కానేకాదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
Amit Shah : సీఏఏ చట్టం వాళ్లకు మాత్రమే.. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం : అమిత్ షా
Amit Shah : పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని, దుష్ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొట్టిపారేశారు. గురువారం ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆయన సీఏఏపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పౌరసత్వ చట్టంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం -2019 (సీఏఏ)పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ సహా తృణమూల్, సీపీఐ, ఆప్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. ఎట్టి పరిస్థితులలోనూ కేంద్రం తీసుకొచ్చిన ఈ వివక్షాపూరిత చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని అమిత్ షా తేల్చిచెప్పారు.
రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం మాత్రం విభజన కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఎn్గానిస్తాన్ దేశాల్లో మతపరమైన #హంసను ఎదుర్కొంటూ భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్న ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించినదని షా వెల్లడించారు. భారత పౌరసత్వం కోసం అందరికీ తలుపులు తెరిచే ఉన్నాయని, పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోకుండా ముస్లింలను ఈ చట్టం నిలువరించదని చెప్పారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమ్తన్న వాదన కూడా తప్పేనన్నారు. అది ఆర్టికల్ 14కు ఎలాంటి భంగం కలిగించదని వెల్లడించారు. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా అవగా#హన కల్పిస్తామని తెలిపారు. దీనిగురించి చాలా వేదికలపై మాట్లాడటం జరిగిందని, ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం హరించివేయదని స్పష్టత ఇచ్చారు. అందుచేత ఎవరూ భయపడాల్సిన పనిలేదని షా వివరించారు. ఇది మోడీ తెచ్చిన చట్టమన్న ఆయన, దీనిని రద్దు చేయడం ఎవరికీ సాధ్యంకాదంటూ విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి ఎప్పటికీ అధికారంలోకి రాదని, ఈ విషయం వారికీ తెలుసునని చెప్పారు.
Amit Shah : ఓటు బ్యాంకు విమర్శలు అర్ధరహితం..
సీఏఏను విమర్శిస్తున్న విపక్షాలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. సీఏఏ ద్వారా బీజేపీ కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకుంటోందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ప్రతిపక్షాలకు ఏ పనీ లేదని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్‌ను కూడా స్వార్థ రాజకీయాల కోసం చేసినట్లు వారు విమర్శిస్తుంటారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకూడదా..? అని షా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దును కూడా రాజకీయ లబ్ధి కోసం చేసినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయని అమిత్ షా మండిపడ్డారు. ఇప్పుడు ఒవైసీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వాళ్లు అసత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోసం సీఏఏ ఇప్పుడు అమలు చేయలేదు. 2019లోనే దీన్ని పార్లమెంట్ ఆమోదించింది. కొవిడ్, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. సీఏఏను వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బహిరంగంగా చెప్పాలి. మీ ఆరోపణల్ని రుజువు చేసుకునే బాధ్యత మీదే. ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చామో మేం స్పష్టంగా చెప్పాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరు కూడా వివరణ ఇవ్వండి అని అమిత్‌షా సవాల్ విసిరారు. సీఏఏను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమంటూ విపక్షాలు చేస్తున్న ప్రకటనలను ఆయన తోసిపుచ్చారు. ఇది కేంద్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రానికి ప్రమేయం లేదు. ఎన్నికల తర్వాత అందరూ దీనికి సహకరిస్తే మంచిది. బుజ్జగింపు రాజకీయాల కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చెయ్యవద్దు అని హితవు పలికారు.
Amit Shah కేజ్రీవాల్‌పై ధ్వజం
ఢిల్లిd ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ, అవినీతి మరకలు బయటపడిన తర్వాత ఆయన సహనం కోల్పోయారు. వలసలపై అంత ఆందోళన ఉంటే, బంగ్లాదేశ్ చొరబాట్లు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? విభజన రోజులను ఆయన మరచిపోయినట్లు ఉన్నారు అని షా ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అక్రమ చొరబాట్లను అడ్డుకుని తీరతామని చెప్పారు.