Bengaluru : బెంగళూరులో నీటి కొరత… చేతులెత్తేసిన సీఎం సిద్దూ..!
ప్రధానాంశాలు:
Bengaluru : బెంగళూరులో నీటి కొరత... చేతులెత్తేసిన సీఎం సిద్దూ..!
Bengaluru : దక్షిణాది రాష్ట్రాలలో నీటి కరువు అనగానే ముందుగా గుర్తు వచ్చే పేరు చెన్నై పట్నం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మంచినీళ్ల కోసం చెన్నై వాసులు పడుతున్న యాతన గురించి పలు రకాల కథలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ కష్టం కన్నడ రాష్ట్రానికి వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం వేసవి రాకముందే కన్నడ రాష్ట్రంలో దాహం దహించి వేస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరులో బిందె నీళ్ల MRP రోజురోజుకీ విపరీతంగా పెరుగుతుంది. ఇక కర్ణాటక రాజకీయ నాయకులు డీకే శివకుమార్ కూడా చేతులెత్తేశారు. అయితే అసలు కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు ఇంత నీటి కటకట…?ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే..
వేసవికాలం రాకముందే కర్ణాటక రాష్ట్రంలో నీటి కొరత ఏర్పడింది. భూగర్భ జలాలు ఎండిపోవడంతో మూడు వేలకు పైగా బోరుబావులు కూడా ఎండిపోయాయి. దీంతో నీళ్లు దొరక్క కన్నడ ప్రజానీకం సతమతమవుతున్నారు. ఇక ఈ సమస్యను డిప్యూటీ సీఎంకు చెప్పగా నీళ్లు లేవన్న సంగతి నాకు కూడా తెలుసు మా ఇంట్లో ఉన్న బోర్ కూడా ఎండిపోయింది ఏం చేయమంటారు అంటూ స్వయంగా డిప్యూటీ సీఎం కూడా చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య పలు రకాల నేతలతో నీటి కొరత పై లోతుగా చర్చలు జరుపుతున్నారు. మంచినీటి కొత్త పై లోతుగా చర్చలు జరుపుతున్నారు. అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవసరం అయితే జిల్లాకు 70 కోట్ల నిధులు కూడా రిలీజ్ చేస్తామని కొత్త బోర్ బావులు తవ్వండి అంటూ సిద్దు సర్కార్ హామీ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం మంచినీళ్లు తర్వాతనే ఏదైనా అనేది కర్ణాటక సర్కార్ హుకుం.
అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 7వేలకు పైగా గ్రామాలలో వెయ్యికి పైగా వార్డులలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం కూడా అవసరమైన చోట్ల ట్యాంకర్లను సప్లై చేయండి అంటూ ప్రైవేట్ బోర్ వెల్స్ కి ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే మోస్తారు నీటి వనరులు ఉన్న హోస్కోట్ చెన్నపట్న, మగడి వంటి ప్రాంతాలు ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఇక ఎప్పటినుండో సిలికాన్ సిటీగా పిలవబడే బెంగళూరులో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది అని చెప్పాలి. నీటి కోసం ఆఫీసులను వదిలేసి మరి ట్యాంకర్ల వద్ద క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బెంగళూరులో రెండు బిందెల నీటిని నాలుగు రోజులు ముందే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కనీసం స్నానం చేయడానికి బయటకు వెళ్లడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.