Good News : రైతులకీ గుడ్ న్యూస్.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఎకౌంట్ లలో ₹8000..!!
Good News : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసిన తర్వాత…బీజేపీ రైతులకు సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుని పలు పథకాలతో రైతులకు ప్రోత్సాహం కల్పిస్తుంది. దీనిలో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి మొదటి తారీకు పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లాస్ట్ బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతిలో బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. ముఖ్యంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రధాని మోడీ
centeral Govt good news for farmers 8000 in accountsపలువురు కేంద్ర మంత్రులతోపాటు చర్చించి సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అందించే మొత్తాన్ని పెంచే యోచనలో కేంద్రం ఉందట. ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి ₹6000 రూపాయలు రైతులకు కేంద్రం అందిస్తూ ఉంది. ఇది మూడు విడతలలో ₹2000 రూపాయలు చొప్పున అందజేస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తాన్ని ఈసారి బడ్జెట్ లో ₹8,000కు పెంచే ఆలోచనలో ఉన్నట్లు నాలుగు విడతల్లో ₹2000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో… వేయడానికి కేంద్రం రెడీ అయినట్లు సమాచారం.
ఈ రీతిగా రైతులకు మేలు చేయడానికి మోడీ ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో కేవలం రెండు హెక్టార్ల లోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే పథకాన్ని వర్తింపజేశారు. కానీ తర్వాత ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 12 సార్లు రైతుల ఖాతాలో నిధులను జమ చేయడం జరిగింది. అయితే ఈసారి చివరి బడ్జెట్ నేపథ్యంలో రైతులకు ఈ పథకం కింద ఎనిమిది వేల రూపాయలు అందించాలని కేంద్రం డిసైడ్ అయినట్లు సమాచారం.