Central Govt : ఇక పై రోడ్డు ప్రమాదం బాధితులకు ఉచిత చికిత్స… కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Central Govt : ఇక పై రోడ్డు ప్రమాదం బాధితులకు ఉచిత చికిత్స… కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్…!

 Authored By ramu | The Telugu News | Updated on :24 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Central Govt : ఇక పై రోడ్డు ప్రమాదం బాధితులకు ఉచిత చికిత్స... కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్...!

Central Govt : ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అయితే రోడ్డు ప్రమాదాలు అనేవి అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి నడపటం వలన జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. మరికొందరు అంగవైకల్యం పొందుతున్నారు. అయితే ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు సరైన చికిత్స అందకపోవడం వలన చాలామంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ఇలాంటి వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతను అలాగే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఈ కొత్త పథకం ద్వారా బాధితులకు వెంటనే వైద్య సేవలు అందనున్నట్లు తెలుస్తుంది. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికోసం ఎలాంటి ఫీజు లేకుండా ట్రీట్మెంట్ చేసే విధంగా కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలలో గాయమైన వారు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా చికిత్స పొందవచ్చు.

అయితే ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రవేశ పెట్టబోతోంది. ఇక ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదట దీనిని చండీగఢ్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ పథకాన్ని ముందుగా ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఎలా పనిచేస్తుందో పర్యవేక్షించి అనంతరం దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ పథకంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుని ఒక మంచి ప్రణాళికతో ప్రాజెక్టును కొనసాగిస్తారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు విజయవంతమైనట్లయితే దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు కారణంగా గాయపడుతున్న చాలామందికి ఉచిత వైద్యం అందుతుంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా మరణాలు గణనీయంగా తగవచ్చు.

ఇది ఇలా ఉంటే తాజాగా వెలువడిన ఓ నివేదిక ప్రకారం 2022లో దేశ వ్యాప్తంగా 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.68 లక్షల మంది మరణించగా 4.43 లక్షల మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ పథకం అమలులోకి తీసుకువచ్చినట్లయితే రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ చికిత్స అందడంతో వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఇక ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని పౌరులు ఎవరైనా సరే ప్రమాదానికి గురైన వెంటనే సమీపంలోని ఏదైనా ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స పొందే విధంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఆసుపత్రులు పనిచేస్తాయి. ఇక ఈ వైద్యానికి బాధితుడి నుండి ఒక రూపాయి కూడా వసూలు చేయరు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది