Chandrababu : కింగ్ మేకర్ గా చంద్రబాబు.. ప‌దేళ్ల‌లో ఇంత ఛేంజ్‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chandrababu : కింగ్ మేకర్ గా చంద్రబాబు.. ప‌దేళ్ల‌లో ఇంత ఛేంజ్‌..!

Chandrababu : కాలం చాలా చిత్రమైనది. ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో అంతుచిక్కదు. ఎంతో వెలుగు వెలిగిన వారిని ఒక్కోసారి పాతాళానికి పడేస్తుంది. ఇంకా ఏం లేదు అంతా అయిపోయింది అనుకునే వాళ్లకు మరో దారి చూపుతుంది. కాలం పెట్టే పరీక్షలో కామ్ గా ఉండి మనదైన సమయం కోసం ఎదురుచూడాలే కానీ.. ఆ ఓపికకు కాలం సైతం కరిగిపోతుంది. పడిపోయిన వారిని కూడా పైకి లేపుతుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఏపీలో కూటమి భారీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 June 2024,5:49 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : కింగ్ మేకర్ గా చంద్రబాబు.. ప‌దేళ్ల‌లో ఇంత ఛేంజ్‌..!

Chandrababu : కాలం చాలా చిత్రమైనది. ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో అంతుచిక్కదు. ఎంతో వెలుగు వెలిగిన వారిని ఒక్కోసారి పాతాళానికి పడేస్తుంది. ఇంకా ఏం లేదు అంతా అయిపోయింది అనుకునే వాళ్లకు మరో దారి చూపుతుంది. కాలం పెట్టే పరీక్షలో కామ్ గా ఉండి మనదైన సమయం కోసం ఎదురుచూడాలే కానీ.. ఆ ఓపికకు కాలం సైతం కరిగిపోతుంది. పడిపోయిన వారిని కూడా పైకి లేపుతుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఏపీలో కూటమి భారీ విజయాన్ని సాధించడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి కింగ్ మేకర్ గా మారారు. 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం కోల్పోయాక అంతా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అనుకున్నారు.

ఆయన కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని ప్రయత్నిస్తే కుదరదని ముఖం మీదనే చెప్పిన వాళ్లు ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయాన్ని సాధించడంతో చంద్రబాబు కింగ్ మేకర్ గా మారారు. ఇప్పుడు ఆయన అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. మోడీని కలిసిన సందర్భంగా ఎదురెళ్లి ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేస్తే మోడీ పెద్దగా పట్టించుకోకపోవడం కనిపించింది. అప్పటి నుంచి చంద్రబాబును కాస్తంత దూరం పెడుతున్నట్టుగానే ఉన్నారు.

Chandrababu కింగ్ మేకర్ గా చంద్రబాబు ప‌దేళ్ల‌లో ఇంత ఛేంజ్‌

Chandrababu : కింగ్ మేకర్ గా చంద్రబాబు.. ప‌దేళ్ల‌లో ఇంత ఛేంజ్‌..!

గడిచిన పది సంవత్సరాల్లో చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారన్నది వాస్తవం. విపక్షంలో ఉండి జైలుకు వెళ్లడం సహా ఎన్నో కష్టనష్టాలను చూశారు. ఎన్నికల్లో గెలుపొందడమే తన పరిస్థితులను మారుస్తుందని నమ్మిన ఆయన.. 70 సంవత్సరాలు పైబడిన వయసులో పడిన కష్టానికి ఫలితం ఇప్పుడు కళ్ల ముందుకు వచ్చింది. ఇప్పుడు కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు అవసరం ఏర్పడింది. మొన్నటి వరకు తనను పట్టించుకోని వారందరూ ఇప్పుడు సగౌరవంగా ఆహ్వానం పలకడం కాలం మహిమే. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పే స్థాయికి వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, స్పీకర్ పదవితో పాటు రెండు కేబినెట్ బెర్తులు డిమాండ్ చేస్తున్న టీడీపీ చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌గా.. జేడీయూ రైల్వేతో పాటు వ్యవసాయశాఖను కోరుతున్నట్లు NDTV వెల్లడి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది