7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా పెరగనున్న జీతాలు
7th Pay Commission : డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. డీఏ పెంపు అనేది నిజానికి గత జులై నెలలోనే జరగాలి కానీ.. లేట్ అయింది. వినాయక చవితికి ఎలాగైనా ప్రకటిస్తారని అనుకున్నారు కానీ.. వినాయకచవితికి కూడా ప్రకటించలేదు. దీంతో ఇక దసరా బొనాంజాగా కేంద్రం డీఏను పెంచుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావించారు. దసరా పండుగ దగ్గరికి వస్తున్నా ఇంకా డీఏ పెంపుపై మాత్రం కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ.. త్వరలోనే కేంద్రం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 4 శాతం డీఏ పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ.. ఇంకా డీఏ పెంపు నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఒకవేళ 4 శాతం డీఏ పెరిగితే ప్రస్తుతం ఉన్న 42 శాతం డీఏ కాస్త… 46 శాతంగా మారుతుంది. డీఏ పెంపు ఇప్పుడే అయినా జులై 1, 2023 నుంచి ఉన్న బకాయిలన్నీ ఇవ్వనున్నారు.
యూనియన్ కేబినేట్ భేటీ ఇవాళో, రేపో జరగనుంది. ఈ రెండు రోజుల్లో మంత్రిత్వ శాఖ భేటీలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. నిర్ణయం తీసుకోగానే వెంటనే డీఏ పెంపుపై ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు డీఏ పెంపు ప్రకటన వెలువరించినా.. వెంటనే నవంబర్ జీతంతో పాటు పెరిగిన డీఏ కూడా వస్తుంది. అలాగే.. జులై నుంచి అక్టోబర్ వరకు ఉన్న డీఏ బకాయిలను కూడా కలిపి జీతంతో పాటు వేయనున్నారు. అంటే.. నవంబర్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు రానున్నాయన్నమాట. డీఏ, డీఆర్ పెంపుతో 47 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
7th Pay Commission : 4 శాతం డీఏ పెరిగితే జీతం ఎంత పెరుగుతుంది?
బేసిక్ వేతనం రూ.18 వేలు ఉన్న ఉద్యోగికి 4 శాతం డీఏ పెరిగిన ప్రకారం లెక్కేస్తే.. రూ.8280 రూపాయలు అదనంగా వస్తాయి. 42 శాతం డీఏ ఉన్నప్పుడు రూ.7560 డీఏ వచ్చేది. ఇప్పుడు 46 శాతం డీఏ అంటే.. రూ.8640 వస్తాయి. అదే బేసిక్ వేతనం రూ.56,900 ఉన్న ఉద్యోగికి 42 శాతం డీఏ ప్రకారం లెక్కిస్తే రూ.23,898 డీఏ కింద చెల్లిస్తారు. అదే 46 శాతం కింద లెక్కేస్తే రూ.26,174 డీఏ డబ్బులు వస్తాయి.