LPG Cylinder : LPG సిలిండర్లపై సబ్సిడీ ఎలా పొందాలంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

LPG Cylinder : LPG సిలిండర్లపై సబ్సిడీ ఎలా పొందాలంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  LPG Cylinder : LPG సిలిండర్లపై సబ్సిడీ ఎలా పొందాలంటే...!

LPG Cylinder : ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు చాలా మంది ప్రజలు LPG సిలిండర్లపై సబ్సిడీని పొందుతూ వస్తున్నారు. అయితే ఈ సబ్సిడీ నుండి దాదాపు 300 రూపాయలు ఆదా అవుతుండగా ఈ సబ్సిడీ ప్రయోజనాలు 12 సిలిండర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి..అయితే ఈ 12 సిలిండర్ల సబ్సిడీని పొందాలంటే ప్రజల కచ్చితంగా LPG ఉజ్వల యోజన పథకానికి అప్లై చేసి ఉండాలి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉజ్వల యోజన పథకం కింద 9 కోట్ల మందికి పైగా ప్రజలు కనెక్ట్ అయ్యారని అధికారికంగా తెలుస్తోంది. మరి దీనిని మీరు కూడా పొందాలి అంటే ఈ కథనాన్ని పూర్తిగా చదివి పూర్తి సమాచారం తెలుసుకోండి…

LPG Cylinder : LPG సిలిండర్స్ ఎలా పొందాలి…

అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం కింద పేద మహిళలకు సిలిండర్ పై దాదాపు 300 రూపాయల సబ్సిడీని అందిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సబ్సిడీ అనేది మార్చి 24 వరకు మాత్రమే కానీ ఇప్పుడు ఈ పథకం మార్చి 31 2025 వరకు పొడిగించడం జరిగింది. ఇక ఈ ఉజ్వల యోజన పథకం కింద సిలిండర్లపై పేద మహిళలకు ఇస్తున్న సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.

LPG Cylinder : సబ్సిడీ ఎప్పటినుండి వస్తుందంటే..

అయితే గతంలో 2022లో ఇంధన ధరలు పెరగడం వలన ఉజ్వల పథకం కింద లబ్ధిదారుల సిలిండర్లపై 200 రూపాయలు మాత్రమే సబ్సిడీగా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుండి సబ్సిడీ సిలిండర్ల పై 200 రూపాయలు మాత్రమే సబ్సిడీ లభించేది. ఆ తర్వాత అక్టోబర్ 2023లో 300 రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సబ్సిడీ అనేది ఏడాదికి 12 LPG సిలిండర్ల పై మాత్రమే లభిస్తుంది. ఇక ఈ పథకం ద్వారా దాదాపు దేశంలో 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పథకానికి దాదాపు 12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే మరో 100 కోట్లు పెంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు.

LPG Cylinder LPG సిలిండర్లపై సబ్సిడీ ఎలా పొందాలంటే

LPG Cylinder : LPG సిలిండర్లపై సబ్సిడీ ఎలా పొందాలంటే…!

LPG Cylinder : ప్రధానమంత్రి ఉజ్వల యోజన…

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం 2016లో ప్రారంభించింది. ఇక ఈ పథకం ద్వారా గ్రామీణ మరియు పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధన పెట్రోలియం గ్యాస్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కలెక్షన్లు ఇవ్వబడుతున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం వారు LPG సిలిండర్లను నింపుకుంటే సరిపోతుంది. అనంతరం వారికి ప్రభుత్వం సబ్సిడీ కింద తిరిగి వారి ఖాతాలోకి డబ్బును జమ చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికీ కొందరికి సబ్సిడీ కింద డబ్బులు వారి యొక్క ఖాతాలో జమ కావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది