కూలీ పని చేసి భర్తను చదివిస్తే .. చివరకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త ..!
ప్రస్తుత కాలంలో భార్యాభర్తల బంధం ఎలా ఉందంటే ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళు కూడా చివరికి విడిపోతున్నారు. ఇటీవల భార్య చేతిలో మోసపోయిన భర్తల గురించి విన్నాం. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు పురుషులు భార్యను ఎలా మోసం చేశారో చెప్పుకొచ్చారు. ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్ కి చెందిన కమ్రు హతిలే , మమత 2015 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో కమ్రు నిరుద్యోగి. దీంతో భార్య భర్తను ఉన్నత స్థితిలో ఉంచడానికి అతడిని పోటీ పరీక్షలకు సిద్ధం చేసింది. దానికి అవసరమైన ఖర్చులు తాను భరిస్తానని బాధ్యత తీసుకుంది. పలు ఇళ్లల్లో పనిమనిషిగా చేరి అంట్లు, ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులు చేసింది.
అంతేకాకుండా అతని పుస్తకాల కోసం మరింత డబ్బులు అవసరం కావడంతో షాపుల్లో కూడా పని చేసింది. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. కమ్రు పరీక్షల్లో పాసై వాణిజ్య పన్నుల అధికారి అయ్యారు. అయితే ఆయనకు వేరే చోట పోస్టింగ్ రావడంతో భార్యను వదిలేసి అక్కడకు వెళ్లాడు. ఆ తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. మమతను పుట్టింటికి పంపించి మరో మహిళతో సంసారం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన మమత అతడిని నిలదీసింది. భార్యతో ఉండేందుకు భర్త నిరాకరించాడు. దీంతో ఆమె కేసు పెట్టింది.
అయితే ఆమెకు భత్యం 12 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. కానీ ఆమెతో కాపురం చేసేందుకు ఒప్పుకోలేదు. అయితే తిరిగి ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 22న జరగనుంది. ఇక మమతకు ఇది రెండో పెళ్లి. ఆమె మొదటి భర్త చనిపోయాడు. ఆమె కొడుకు కూడా 15 సంవత్సరాల వయసులో కొన్ని నెలల క్రితం మరణించాడు. ఇన్ని కష్టాలలో ఉన్న మమత గుండె ధైర్యం చేసుకొని తన భర్త తనకు కావాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. మరీ ఈ కేసు ఎటు తిరుగుతుందో చూడాలి.